Prithvi- Vishnu Priya : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం మరి కొద్ది రోజులలో ముగియనుంది. దాదాపు షో చివరి స్టేజ్‌కి వచ్చిందని చెప్పాలి. ఎవరు విజేతగా నిలుస్తారు, ఎవరు టాప్ 5లో నిలుస్తారు అనే దానిపై కొద్ది రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే షో నుండి బయటకు వచ్చిన వారు చేసే కామెంట్స్ కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ప్రతి సీజన్ లో హౌస్ లో గేమ్ కంటే లవ్ ట్రాక్ తో హైలైట్ అయ్యే సభ్యులు కొందరు ఉంటారు. ఈ సారి అలా విష్ణు ప్రియ- పృథ్వీ జంట ఒకటి అని చెప్పాలి. హౌజ్‌లో ఉన్నప్పుడు వీరిద్దరి ప్రేమాయణం చూసి తోటి సభ్యులు కూడా షాక్ అయ్యారు.
ముఖ్యంగా విష్ణుప్రియ.. పృథ్వీపై బాగా ప్రేమ కురిపించింది. పృథ్వీ కోసం చాలా గొడవల్లో ఇన్వాల్వ్ అయింది. విష్ణుప్రియ ప్రేమ మాయ వల్లో, నిర్లక్ష్యం వల్లో కానీ పృథ్వీ ఫిజికల్ గేమ్ తప్ప, మైండ్ గేమ్ పై ఫోకస్ చేయలేదు. నోరు జారుతూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. మరింత నెగెటివిటీని మూటగట్టుకొని బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే బయటకు వచ్చిన పృథ్వీ పలు ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. విష్ణుప్రియతో తన ప్రేమ గురించి అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పేశాడు. విష్ణుప్రియ నన్ను నిజంగానే ప్రేమించింది. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను అడిగినప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ కంటే చాలా ఎక్కువ అని చెప్పడం తప్ప తప్ప లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ నాపై ఆమెకి ఉన్న ప్రేమ తెలుసు అని అన్నాడు.
అయితే తనని నేను ఎప్పుడు ప్రేమించలేదు. మంచి ఫ్రెండ్‌గా భావించాను. నాపై ఎక్కువ ప్రేమిస్తున్న సమయంలో అంతగా ఆశలు పెట్టుకోవద్దని చెప్పాను. ఆమె క్యూట్ నెస్ నాకు చాలా ఇష్టం. కానీ ప్రేమ వరకు వెళ్ళలేదు అని పృథ్వీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫ్యూచర్ లో విష్ణుప్రియ నాపై ప్రేమ పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి నాపై ఆశలు పెట్టుకోవద్దని ఆమెకి క్లారిటీ ఇచ్చినట్లు పృథ్వీ తెలిపారు. మరి దీనిపై బయటకు వచ్చాక విష్ణు ప్రియ ఎలాంటి రిప్లై ఇస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.