Star Hero : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ బాగా నడుస్తుంది. స్టార్ హీరో హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూసే ఈ క్యూట్ చిన్నోడు పక్కా తెలుగు అబ్బాయి. అమయాకపు చూపులతో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం. ఇతను కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగి తనదైన ట్రెండ్ ని సెట్ చేశాడు. ఇతను అంటే అభిమానుల్లో ఫుల్ క్రేజ్ వుంది. తెలుగులో కూడా రీమేక్ చిత్రాల ద్వారా తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో ఎంతో హ్యాపీగా గడుపుతున్నారు. అంతేకాకుండా ఇతను మంచి బైక్ రేసర్ కూడా. కోలీవుడ్ అభిమానులు ఇతను ముద్దుగా తల అని పిలుచుకుంటారు. ఇంకా ఈ హీరో ఎవరో గుర్తుపట్టలేదా.. అతనే సౌత్ ఇండియన్ ఫేమస్ స్టార్ హీరో అజిత్. అజిత్ సికింద్రాబాద్ లో జన్మించారు. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. టాలీవుడ్ లో శ్రీకర్ గా ప్రేమ పుస్తకం చిత్రంతో హీరోగా వెండితెరపై అడుగు పెట్టాడు.
తమిళ్ లో అజిత్ నటించిన ప్రేమలేఖ సినిమా ద్వారా ఒక్కసారిగా ఆయన క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా అజిత్ ను అమ్మాయిల కలల రాకుమారుడుగా మార్చేసింది. అజిత్ చదివింది పదో తరగతి మాత్రమే. కానీ పలు భాషలలో ఎంతో అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషలతోపాటు ఇంగ్లీష్ కూడా స్పష్టంగా మాట్లాడుతాడు. బైక్ మెకానిక్ గా జీవితాన్ని ప్రారంభించిన అజిత్ ఆ తర్వాత దేశంలోనే అత్యుత్తమ ట్రావెలర్ లలో ఒకరిగా నిలిచారు. అజిత్ కుమార్ 2000 సంవత్సరంలో తాను ప్రేమించిన హీరోయిన్ షాలినిని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.