Chanakya Niti : చాణక్య చాలా విషయాల గురించి చెప్పారు. జీవితంలో ఎదురయ్యే, అనేక సమస్యల గురించి చాణక్య చెప్పడం జరిగింది. చాణక్య చెప్పినట్లు చేస్తే, అద్భుతంగా జీవితం ఉంటుంది. ఆచార్య చాణక్య చెప్పిన అద్భుతమైన విషయాలని, మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆరు విషయాలను కనుక పాటించినట్లయితే, జీవితంలో డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చాణక్య చెప్పడం జరిగింది. మరి, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలంటే, వీటిని కచ్చితంగా పాటించండి. ఎప్పుడూ కూడా ఖర్చు చేసేటప్పుడు ఆలోచించకుండా ఖర్చు చేయకండి. డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు, ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.
అలానే, చాణక్య చెప్పిన దాని ప్రకారం డబ్బులు సరిగ్గా ఉపయోగించాలి. చెడు పనుల ద్వారా సంపాదించిన డబ్బు, ఎలాంటి మేలు చేయదు. డబ్బుకి బానిస కాకూడదు అని చాణక్య చెప్పారు. సరైన స్థలంలో ఉండాలని, మంచి స్థలంలో నివసించడం ద్వారా, ఒక వ్యక్తి సులభంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చాణక్య చెప్పారు. చాణక్య చెప్పిన దాని ప్రకారం, అనైతిక మార్గాల ద్వారా డబ్బులు ని జీవితాంతం సంపాదించలేరు. దాని వ్యవధి కేవలం పదేళ్లు మాత్రమే. 11వ సంవత్సరం తర్వాత, అటువంటి సంపద నశించడం మొదలవుతుంది.
శాంతిని కూడా అది నాశనం చేస్తుంది. కాబట్టి, అక్రమంగా సంపాదించిన ధనం కొద్దికాలం మాత్రమే ఉంటుందని తెలుసుకోండి. ఎప్పుడూ కూడా ఇతరులని గౌరవించాలి. ఇతరులను గౌరవించేటప్పుడు, వాళ్లు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇతరులని గౌరవిస్తే, సమాజంలో మనకి కూడా గౌరవం ఉంటుంది.
ఇతరులని కించపరచడంలో ఆనందించే వారిని సమాజం ఎప్పటికీ గౌరవించదు. అలానే, చాణక్య లక్ష్మీదేవిని పూజించాలని కూడా చెప్పారు. ప్రశాంత వాతావరణం ఉండాలి. అలా, లేకపోతే లక్ష్మీదేవి అక్కడ నివసించదు. అందరికీ డబ్బు కావాలి. కానీ డబ్బు పై వ్యామోహం ఉండకూడదని చాణక్య అన్నారు. ఇలా, ఈ విషయాలను కనుక మీరు పాటించినట్లయితే ఆర్థిక సమస్యలు ఏమి లేకుండా ఉండవచ్చు.