Jojoba Oil For Beauty : చాలామంది తెల్లగా రావాలని, అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా చేశారంటే అందంగా మీ ముఖం మారిపోతుంది. కాంతివంతంగా తయారవుతుంది. ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా సరే, చిన్న చిట్కా తో తెల్లగా మారిపోవచ్చు. ఈ రెండింటిని వాడడం ద్వారా మీ చర్మం తెలుపు రంగులోకి వచ్చేస్తుంది. ఒక నిమ్మకాయను తీసుకుని, దాని తొక్కల్ని తీసేసి, తొక్క ని తురుముకోవాలి. తర్వాత తురుముకున్న నిమ్మకాయ తొక్క ఒక గిన్నెలో వేసుకోవాలి.
ఇందులో బాదం నూనెని వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు బాదం నూనె వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మరిగించుకోండి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుని, తర్వాత దీన్ని వడకట్టుకోవాలి. దీంట్లో జోజోబా ఆయిల్ వేసుకోవాలి. ఇది మనకి ఈజీగానే దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో లేదంటే ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు.
ఈ ఆయిల్ కూడా వేసాక, ఒక గాజు సీసా తీసుకుని బాగా గట్టిగా మూత పెట్టేయాలి. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే, నెల రోజులు పాటు దీనిని ఉపయోగించుకోవచ్చు. దీనిని మీరు రాసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. ఆయిల్ రాసేటప్పుడు ముఖానికి మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలి.
రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు మసాజ్ చేసుకుని అలా వదిలేసి, తర్వాత రోజు మీరు ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు. నెల రోజులు పాటు మీరు ఈ ఆయిల్ ని వాడినట్లయితే, చక్కటి ఫలితం కనబడుతుంది. బాడీకి కూడా రాసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కేవలం నిమ్మకాయతో ఈ నూనెతో ఈజీగా తెల్లటి స్కిన్ ని పొందొచ్చు.