మనలో చాలా మంది వేడి వేడి టీలో బిస్కెట్లను ముంచి తింటుంటారు. కొందరు బ్రెడ్ కూడా ముంచి తింటుంటారు. అయితే టీ లో బిస్కెట్లను ముంచి తినే అలవాటు మనకు లేదు. ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? మొదటగా ఎవరు దీన్ని ప్రారంభించారు ? మనకు ఎలా అలవాటు అయింది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బిస్కెట్లను మొదటగా బ్రిటన్‌లో 16వ శతాబ్దంలోనే తయారు చేశారు. అయితే అప్పట్లో బిస్కెట్లు చాలా గట్టిగా ఉండేవి. దీంతో వాటిని టీలో ముంచి తినేవారు. అయితే అప్పట్లో మనకు టీ తాగే అలవాటు లేదు. కానీ బ్రిటిష్ వారు మనల్ని పాలించడం మొదలయ్యాక మన దగ్గర టీ తోటలను పెంచడం ప్రారంభించారు. దీంతో మన దగ్గర కూడా టీ లభ్యమైంది.
అయితే బ్రిటిష్ వారు టీని మనకు పరిచయం చేశాక వారి అలవాట్లు కూడా చాలా వరకు మనకు వచ్చాయి. అందుకనే మనం కూడా వారిలాగే బిస్కెట్లను టీలో ముంచి తినడం ప్రారంభించాం. నిజానికి మనకు ఈ అలవాటు లేదు. అయితే 19వ శతాబ్దం వచ్చాక బిస్కెట్లు సాధారణంగానే ఉండేవి. వాటిని సులభంగా తుంచి తినేవారు. కానీ వాటిని టీలో ముంచి తినే అలవాటు మాత్రం పోలేదు. అది అలాగే కొనసాగుతూ వస్తోంది. ఇదీ.. అసలు విషయం..!