Eggs With Other Foods : ప్రతి ఒక్కరు, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే, అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది అని గుర్తుపెట్టుకోండి. మనం ఈ ఆహార పదార్దాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. దీనిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇలాంటివి చూసుకుంటాం. కానీ ఈ ఆహార పదార్థం తీసుకున్నాక, ఈ ఆహారం తీసుకోవచ్చా అని, రెండో ఆహార పదార్థాల గురించి పెద్దగా పట్టించుకోము.
కానీ, కొన్ని ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే, కచ్చితంగా ఆరోగ్యం పాడవుతుంది. గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది గుడ్లని వివిధ రకాలుగా తీసుకుంటూ ఉంటారు. గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, ఫోలేట్, ఐరన్ ఇలా.. అయితే గుడ్లు తీసుకునేటప్పుడు మాత్రం కొన్ని పొరపాట్లు చేయకూడదు.
చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. గుడ్లు తీసుకున్న తర్వాత లేదంటే గుడ్లతోపాటుగా సోయా మిల్క్ తీసుకోవడం మంచిది కాదు. రెండిట్లో కూడా ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎక్కువగా ఈ రెండు తీసుకోవడం వలన ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. పచ్చి గుడ్లు, సోయా మిల్క్ తీసుకుంటే బయోటిన్ లోపం కలుగుతుంది. గుడ్లతో పాటుగా టీ తీసుకుంటే కూడా ఆరోగ్యం చెడిపోతుంది. రెండిటిని అసలు కలిపి తీసుకోవద్దు.
అలానే పంచదార, గుడ్లు కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదు. రెండు ఒకేసారి తీసుకోవడం వలన బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంది. గుడ్లు, మాంసం కలిపి కూడా తీసుకోవద్దు. ఒకవేళ అలవాటు ఉన్నట్లయితే మానుకోండి. రెండు ఒకేసారి తీసుకోవడం వలన ప్రోటీన్ బాగా ఎక్కువైపోతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. ఇకమీదట ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. చాలామంది తెలియక ఇలా తీసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు.