ఇప్పుడంటే జనాభా నియంత్రణను పాటిస్తున్నారు. కానీ ఒకప్పుడు అసలు దీనిపై పెద్దగా ఎవరికీ అవగాహన లేదు. పైగా అప్పట్లో అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కనుకనే పదుల సంఖ్యలో పిల్లల్ని కనేవారు. కానీ ఇప్పుడు ఒకరిద్దరిని కనడమే కష్టతరమవుతోంది. అయితే మనకు తెలిసిన చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులకు మాత్రం అధిక సంఖ్యలో సంతానం కలిగారు. ఇక వారు ఎవరు, ఎంత మంది, వారి పేర్లు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లాలు ప్రసాద్ యాదవ్ – దాదాపు రెండు దశాబ్దాలుగా బీహర్ రాజకీయాలలో లాలు ప్రసాద్‌యాదవ్ ఒక బలమైన వ్యక్తి. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అద్యక్షుడు కూడా. పాట్నా విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన లాలూకు రాబ్దీ దేవి భార్య. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు. వీరందరూ రాజకీయాల్లో ఎంతో పేరుగాంచారు.
నందమూరి తారక రామారావు – ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేశారు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
అక్కినేని నాగేశ్వరరావు – అక్కినేని నాగేశ్వర రావు ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత. వరి చేలలో నుండి నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకరు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందారు. నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు ఐదుగురు సంతానం. అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున, సత్యవతి అక్కినేని, నాగసుశీల, సరోజ అక్కినేని.
కరుణానిధి – ఎం.కెగా, డా.కళైనార్‌గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కరుణానిధికి ఆరుగురు సంతానం. 4 మంది కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు.
ఘట్టమనేని కృష్ణ – తెలుగు సినీ పరిశ్రమలో హీరో కృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణ సంతానం ఐదుగురు. ముగ్గురు కుమార్తెలు పద్మావతి, ప్రియదర్శని, మంజుల. ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు.