ప్రస్తుత నేపథ్యంలో డబ్బులకు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రూ.25వేలు సంపాదించే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది. అందుకు మీరు ఏం చేయాల్సిన పనిలేదు. మీ వద్ద పాత రూ.10 నోట్లు ఉంటే చాలు. అయితే ఆ పది నోటు పలు భిన్నమైన ఫీచర్లను కలిగి ఉండాలి.
సదరు రూ.10 పాత నోటుపై ఒక వైపు అశోక స్థూపం ముద్రించబడి ఉండాలి. రెండో వైపు పడవ ముద్రించబడి ఉండాలి. ఈ భిన్నమైన నోట్లను 1943లో బ్రిటిష్ వారి కాలంలో ముద్రించారు. ఆ నోట్లపై అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ సంతకం ఉండాలి. అది ఇంగ్లిష్‌లో రెండు వైపులా ఉండాలి.
పైన చెప్పిన ఫీచర్లు ఉండే నోట్లను ఎవరైనా కలిగి ఉంటే వాటిని కాయిన్ బజార్ . కామ్ అనే సైట్‌లో విక్రయించవచ్చు. దీంతో రూ.25వేల ధర పలుకుతాయి. వాటిని అమ్మి ఆ మేర సొమ్ము సంపాదించవచ్చు. అదే కాలానికి చెందిన రూ.5 నోటు అయితే రూ.30వేలు వస్తాయి.