ధర్మశాస్త్రాల ప్రకారం…మనం చేసే సర్వ కర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దాని వల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలంటే, వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుని సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులవుతాము. ఈఉద్దేశంతోనే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలయింది. కాబట్టి తలనీలాలు సమర్పించడమంటే …ఇంతవరకూ ఎన్నో పాపాలు చేశాం, వాటిని విడిచి ఇకపై పవిత్రంగా జీవిస్తా అని దేవునికి మాటివ్వడమన్న మాట..! అంతే కాదు దీనికి ఒక కథ కూడా ఉంది. తిరుమేలేశుడుకి తలనీలాలు సమర్పించడంలో ప్రత్యేకత ఏమిటి… తెలుసుకోవాలంటే ఈ క్రింది కథను తెలుసుకోవాల్సిందే..
గొల్లడి గొడ్డలి దెబ్బకి నుదుటన తగిలిన గాయాన్నీ పట్టించుకోకుండా… పుట్టను వదిలి ముందుకు సాగిపోతుంటే వనదేవత నీల ప్రత్యక్ష్యమై… ఆవేదనతో ప్రభూ అని పలకరుంచింది… స్వామివారు చప్పున ఆగి ఆమే వైపు చూశాడు…! ప్రభూ… దేవాది దేవులైన తమకా ఈ అవస్థ… సర్వ జగద్రక్షులైనా తమకా ఈ దుస్థితి…? అంటూ నీల కన్నీరు కారుస్తూ… స్వామివారిని ప్రక్కనే వున్న శిలపై ఆశీనులని గావించి… శ్రీనివాసుని తలపై తగిలిన గాయాన్ని తన పమిట చెంగుతో తుడుస్తూ… మీకింత హాని తలపెట్టిన ఆ యాదవుడుకి… ప్రదమ దర్శన భాగ్యం వరాన్నీ వంశ పారం పర్యంగా అనుగ్రహించిన ఔధార్యమూర్తులు… ఈ పరిస్థితిలో ఎక్కడకి వెళ్తారు ప్రభూ అడిగింది బాధగా… స్వామివారు మందహాసం చేసి…
నీల తానే వనదేవత కనుక స్వామి వారి గాయానికి పసరు మందు పూసి ఆకు వేసి కట్టబోతూ… స్వామివారి నుదుటి వైపు పరశీలనగా చూసింది… స్వామివారి శిరస్సు పై గాయం తగిలిన చోట శిరోజాలు రాలిపొయాయి… నీలా బాధతో నొచ్చుకుంటూ… ఏ మాత్రం సంకోచించకుండా తన నల్లటి శిరోజాలను తీసి స్వామివారి శిరస్సుపైన అతికించి… అపుడు తన పమిట కొంగు స్వామివారి గాయానికి కట్టు కట్టింది…! నీలా… స్త్రీలకి శిరోజాలే అలంకారం… నీ అలంకార శోభని నా కోసం త్యాగం చేశావా…? అని అడిగాడు శ్రీవారు… నీలా చిరునవ్వు నవ్వి నన్ను సృష్టించింది మీరు… నా సర్వస్వం మీది… పున్నమి చంద్రుని వంటి మీ అందమైన ముఖంపైన వెలితి కనిపిస్తే సహించగలనా ప్రభూ… నీ సేవ కంటే అందం అలంకారం ఎక్కువనా అంది.!
ఆమె భక్తికి ఔదార్యానికి స్వామివారు మెచ్చి… నీకొక వరం అనుగ్రహిస్తున్నాను… నా దర్శనం కోసం వచ్చి మొక్కుబడిగా నా భక్తులు సమర్పించుకొనే తలనీలాలు ఈ కలియుగాంతం వరకు నీకు చెందుతాయి. భక్తులు సమర్పించే వారి తలనీలాలు పుణ్యఫలంతో తిరిగి నీ శిరస్సుపై సరికొత్త నీలాలు మొలుస్తాయి… నీ ఔదార్యానికీ… సేవానిరితికి గుర్తుగా నీలాద్రి అన్న పేరుతో ఈ తిరుముల ప్రసిద్దమవుతుంది అని అనుగ్రహించాడు శ్రీవారు… నీలా చేతులు జోడించి… భక్తితో… ధన్యురాలిని ప్రభూ అని పలికింది…!