Petrol Consumption In Car For 1 Hour Of AC : ప్రస్తుతం చాలా మంది కార్లను ఉపయోగిస్తున్నారు. సులభమైన ఈఎంఐలు, తక్కువ డౌన్ పేమెంట్ ఆప్షన్‌లను అందిస్తుండడంతో చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక కార్లలో అనేక సదుపాయాలు సైతం ఉంటున్నాయి. అయితే అన్ని కార్లలోనూ కామన్‌గా ఉండే సదుపాయం.. ఏసీ. అవును, ఏసీ లేకపోతే అసలు కారులో ప్రయాణించలేం. అయితే సాధారణంగా చాలా మందికి ఒక అనుమానం వస్తుంది. ఒక గంట పాటు కారులో ఏసీని ఆన్ చేసి ఉంచితే ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది..? అని చాలా మందికి ప్రశ్న వస్తుంటుంది. ఇందుకు సంబంధిత నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కారులో ఏసీని ఆన్ చేసినప్పుడు పెట్రోల్ వినియోగం అనేది కారు మోడల్, ఇంజిన్ కెపాసిటీ, ఏసీ కెపాసిటీని బట్టి ఉంటుంది. సాధారణంగా కార్లలో భిన్న రకాల ఇంజిన్ కెపాసిటీలు ఉంటాయి. అయితే 1.2 లీటర్ల నుంచి 1.5 లీటర్ల ఇంజిన్ కెపాసిటీ ఉన్న కార్లలో అయితే 1 గంట పాటు ఏసీని ఆన్ చేసి ఉంచితే సుమారుగా 0.2 నుంచి 0.4 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది. అదే 2 లేదా అంతకన్నా ఎక్కువ లీటర్ల కెపాసిటీ ఉన్న ఇంజిన్ కలిగిన కార్లలో అయితే ఒక గంట పాటు ఏసీని ఆన్ చేసి ఉంచితే సుమారుగా 0.5 నుంచి 0.7 లీటర్ల మేర పెట్రోల్ ఖర్చు అవుతుంది.
అయితే కారు ఆగి ఉన్నప్పుడు అందులో ఏసీని ఆన్ చేస్తే అప్పుడు పెట్రోల్ వినియోగం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఏసీని ఆన్ చేస్తే ఏసీ కోసం పెట్రోల్‌ను తక్కువగా వాడుకుంటుంది. కానీ కారు మైలేజీ తక్కువగా వస్తుంది. అలాగే ఏసీ సెట్టింగ్‌ను మరీ తక్కువ ఉష్ణోగ్రత వద్ద పెడితే అప్పుడు కంప్రెసర్‌పై భారం పడుతుంది. దీంతో కంప్రెసర్ మరింతగా శ్రమించాల్సి వస్తుంది. అప్పుడు కూడా పెట్రోల్ ను ఎక్కువగా తీసుకుంటుంది.
ఈవిధంగా పలు భిన్న రకాల కారణాల వల్ల కారులో ఏసీ వినియోగంలో ఉన్నప్పుడు పెట్రోల్ ఖర్చు అవడం అనేది మారుతుంది. అయితే ఏ కారు అయినా సరే అందులో ఒక గంటపాటు ఏసీని ఆన్ చేసి ఉంచితే అప్పుడు సుమారుగా 0.2 లీటర్ల నుంచి 0.7 లీటర్ల మధ్య పెట్రోల్ వినియోగం అవుతుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కారులో ఏసీని ఉపయోగించాలి. అప్పుడు ఇంధనం ఎక్కువగా ఖర్చు అవకుండా చూసుకోవచ్చు. అలాగే కారు మైలేజీ కూడా ఎక్కువగా వస్తుంది.