Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

సన్నీ లియోన్ అంటే అలాంటి సినిమాలే గుర్తుపెట్టుకుంటారు ! మరి ఆమె చేసే మంచి పనుల గురించి తెలుసా ?

Admin by Admin
April 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సన్నీ లియోన్.. ఈ పేరు వింటేనే అందరికీ శృంగార తారగానే గుర్తుకు వస్తుంది. ఈమె పేరు చెబితే పులకరించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఈమె శృంగార తార అయినప్పటికీ ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాలని చెరిపేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం సన్నీ లియోన్ సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తన గతాన్ని పక్కన పెట్టేసి మర్యాదపూర్వకంగా బ్రతకాలని ఆశపడుతుంది. అయితే అందరికీ తెలిసిన సన్నీ వేరు.. మనం తెలుసుకోవలసిన సన్నీ వేరు. సన్నీలియోన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. సన్నీలియోన్ తండ్రి టిబెట్ లో పుట్టిన ఓ సిక్కు మతస్థుడు. ఆయన ఢిల్లీలో పెరిగారు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ కి చెందింది. ఈ దంపతులకు 1981 మే 13న సన్నీలియోన్ జన్మించింది. ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా.

సన్నీ లియోన్ పుట్టకముందే ఆమె తల్లిదండ్రులు కెనడాలో స్థిరపడ్డారు. కెనడాలో పుట్టి పెరిగినందుకు ఆమెను ఇండో కెనడియన్ అని పిలుస్తారు. ఇక సన్నీలియోన్ సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి. ఆమె భర్త అమెరికన్ అయినప్పటికీ ఆమె సిక్కు ఆచారాలను అనుసరిస్తుంది. డేనియల్ అనే వ్యక్తితో ఏడాది పాటు డేటింగ్ చేసి వివాహం చేసుకుంది సన్నిలియోన్. అయితే ఈ దంపతులు నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ అమ్మాయిని 11 మంది రిజెక్ట్ చేశారు. కానీ సన్నీ ప్రాంతం, రంగు, తన ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఆ చిన్నారిని దత్తత తీసుకుంది. నిషాని దత్తత తీసుకున్న తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లల్ని పొందింది. వారి పేర్లు నోహ్, యాషేర్. సన్నీలియోన్ కి ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 2011లో జరిగిన బిగ్ బాస్ 5 రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీలియోన్.. ఆ తర్వాత బాలీవుడ్ నటిగా అవకాశం అందుకుంది. జిస్మ్ 2 ఈమె మొదటి హిందీ చిత్రం. ఈ చిత్రం ప్రీ రిలీజ్ అప్పుడు చారిటీ ప్రయోజనాల కోసం లో దుస్తులను అమ్మకానికి పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

do you know these interesting facts about sunny leone

కానీ అది సినిమా ప్రమోషన్స్ కోసం అని చెప్పడంతో చాలామంది విమర్శించారు. కానీ అసలు విషయం ఏమిటంటే తన లో దుస్తులు అమ్మగా వచ్చిన డబ్బులను క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థకు సన్నిలియోన్ విరాళంగా ఇచ్చేసింది. అలాగే ముంబైలోని ఓ పాఠశాలను దత్తత తీసుకొని ఆ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల బాగోగులను తానే స్వయంగా చూసుకుంటుంది. ఆ పాఠశాలలో ఇప్పటివరకు 300 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందినట్లు సమాచారం. ఇక వృద్ధులకు సేవ చేయడం, వారికి సహాయం చేయడం దేవుడికి సేవ చేయడంతో సమానం అని సిక్కు మతం చెప్తుంది. దాని ప్రకారమే ఒక వృద్ధ జంటని సన్నిలియోన్ దత్తత తీసుకొని వారి బాగోగులను తానే చూసుకుంటుంది. ఇక సన్నీ జంతు ప్రేమికురాలు అన్న విషయం మనకు తెలిసిందే. వీధి కుక్కల సంరక్షణ ఎప్పటికప్పుడు చేపడుతూ ఉంటుంది సన్నీలియోన్.

Tags: sunny leone
Previous Post

ఈ ల‌క్ష‌ణాల‌ను శ‌రీరంలో జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే క్యాన్స‌ర్ వ‌స్తుందో, రాదో సుల‌భంగా చెప్పేయ‌వ‌చ్చు..!

Next Post

ఇండస్ట్రీలో అత్యంత సంపన్నులుగా ఉన్న 6 హీరోయిన్స్ వీరే..!

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!