Vastu Items : వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో ఉంచే వస్తువులు కూడా మనపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఈ ప్రత్యేకమైన విగ్రహాలను మన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మనకు జీవితంలో డబ్బ లోటు ఉండదని మీకు తెలుసా….! హిందువులు వాస్తును ఎంతగానో నమ్ముతారు. వాస్తుశాస్త్రంలో దిశలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. మన ఇంట్లో ప్రతిదీ కూడా సరైన దిశలో ఉంచడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పే కొన్ని విగ్రహాలను మనం ఇంట్లో సరైన దిశలో ఉంచుకోవడం వల్ల ఇంటికి అలంకరణగా ఉండడంతో పాటు ఈ విగ్రహాలు మనకు అదృష్టాన్ని కూడా తీసుకువస్తాయి. ఆర్థికంగా నష్టపోయే వారు, డబ్బుకు లోటు ఉన్నవారు ఈ విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు.
మనం ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులల్లో తాబేలు ఒకటి. ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ లో ఉత్తరం లేదా తూర్పు దిశలల్లో లోహపు తాబేలును ఉంచడం మంచిది. లోహపు తాబేలును ఉంచడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. మన విజయంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. మన జీవితంలో ఉండే ఆర్థిక సంక్షోభాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం లోహపు చేపను ఇంట్లో ఉంచుకోవడం మంచిది. ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని ఉంచడం వల్ల వారిపై లక్ష్మ దేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అలాగే హిందువులు ఆవును ఎంతో పవిత్రంగా పూజిస్తారు.
ఇంట్లో ఇత్తడి కామధేను విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిది. ఈ విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం కూడా చాలా శుభప్రదం. ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. శ్రేయస్సు పెరుగుతుంది. ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. అలాగే ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లో హంసల జతను ఉంచడం కూడా చాలా మంచిది. ఇది ఆర్థిక ప్రయోజనాలను అందించడంతో పాటు హంసల జతను ఉంచుకోవడం వల్ల వైవాహిక జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా వాస్తు ప్రకారం ఈ విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని డబ్బుకు లోటు ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.