Vastu Tips : వాస్తు శాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మన పూర్వీకులు ఎంతో కాలం నుంచి వాస్తు నియమాలను పాటిస్తూ వస్తున్నారు. వాస్తును పాటిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా జీవించవచ్చు. అయితే చాలా మంది ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకున్నా.. వారు రోజూ చేసే పలు పనుల కారణంగా కూడా వాస్తు దోషాలు ఏర్పడుతుంటాయి. దీంతో ఇంట్లోని వారికి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కుటుంబ యజమాని ఆర్థిక, ఆరోగ్య సమస్యల బారిన పడతారు. కనుక వాస్తు దోషాలకు కారణం అయ్యే పనులను చేయకూడదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాయంత్రం సమయంలో దేవతలు తిరుగుతుంటారట. కనుక ఆ సమయంలో మనం ఇంటిని ఊడ్చడం, తుడవడం వంటి పనులు చేయకూడదట. లేదంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి మన సంపదను పోయేలా చేస్తుందట. కనుక ఈ తప్పు చేయకండి. అలాగే ఇంటిని, ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కొందరు ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నా.. వారి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండవు. కనుక ఈ విషయంలో జాగ్రత్త పాటించాలి. ఇల్లు లేదా ఇంటి పరిసరాలు గనక శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. అలాంటి చోట్ల ఆమె ఉండదు. దీంతో మనకు డబ్బు సమస్యలు వస్తాయి. కనుక ఈ తప్పును కూడా చేయకండి.
ఇక కొందరు రోజూ చాలా ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. ఇలా లేస్తే దరిద్రం చుట్టుకుంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సూర్యుడు ఉదయించడానికి ముందే నిద్ర లేస్తే మంచిది. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మనపై వరాల జల్లు కురిపిస్తుంది. అప్పుడు మనకు అదృష్టానికి, సంపదకు లోటు ఉండదు. ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే ఉప్పును సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు. కనుక ఎవరికీ ఉప్పును చేతికి ఇవ్వకూడదు. సాయంత్రం అయిన తరువాత ఇతరులకు ఉప్పును అసలు ఇవ్వకూడదు. కనుక ఈ పొరపాటును కూడా చేయకూడదు. లేదంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అన్నీ సమస్యలే వస్తాయి. కనుక ఈ నియమాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.