Kids Eating : చలికాలంలో, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చలికాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా, చిన్నపిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. చలికాలంలో చిన్నారుల ఆరోగ్యం బాగుండాలంటే, ఈ ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వడం మంచిది. చలి కాలంలో బెల్లాన్ని పిల్లలకి పెట్టండి. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లం లో పోషకాలు బాగా ఉంటాయి. ఇందులో కాల్షియంతో పాటుగా ఐరన్, విటమిన్స్ కూడా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా బెల్లం పెంచుతుంది. చలికాలంలో జలుబు, జ్వరం వంటివి రాకుండా చూస్తుంది బెల్లం.
క్యారెట్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చలి కాలంలో క్యారెట్ తీసుకుంటే, పోషకాలు బాగా అందుతాయి. రకరకాల అనారోగ్య సమస్యలు బారిన పడకుండా, పిల్లల్ని కాపాడుతుంది క్యారెట్. క్యారెట్ లో విటమిన్ ఏ తో పాటుగా విటమిన్ బీ6 , విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలానే, పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటుగా యాంటీ మైక్రోబియల్ గుణాలు పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
శీతాకాలంలో పిల్లలకి పాలల్ల పసుపు వేసి ఇవ్వండి. ఉసిరి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరి లో ఎక్కువ ఉంటాయి. పిల్లలకి ఉసిరి ఇవ్వడం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. చలికాలంలో కూరగాయలతో చేసిన సూప్ ని, పిల్లలకి ఇవ్వడం వలన పోషకాలు అందుతాయి. బాడీకి వెచ్చగా ఉంటుంది.
బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటి గింజల్ని కూడా పిల్లలకి ఇవ్వండి. పిల్లల కండరాల పెరుగుదలకి డ్రై ఫ్రూట్ సహాయపడతాయి. చిలగడదుంపల్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బాడీకి వెచ్చదనాన్ని ఇస్తాయి. అలానే, చలికాలంలో పిల్లలకి గింజలని కూడా ఇస్తూ ఉండండి. అవిసె గింజలు మొదలైన గింజలు పిల్లలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలా, ఈ ఆహార పదార్థాలు ని పిల్లలకి ఇస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది.