వ్యోమగాములు వ్యోమనౌకలో వుండగా స్పేస్ సూటు ధరించరు. వ్యోమనౌక నుండి పరిశోధనల నిమిత్తం బయటకు వచ్చినపుడు మాత్రమే స్పేస్ సూటు ధరిస్తారు. వ్యోమనౌక నుండి బయటకు రావడానికి కొన్ని గంటల ముందుగానే స్పేస్ సూటును ధరించి శరీరాన్ని స్పేస్ వాక్ కు సిద్ధం చేస్తారు. ఒకసారి బయటకు వచ్చిన తరువాత వారు ప్రయోగాలు జరిపే సమయం కొన్ని నిముషాల నుండి గరిష్టంగా 7 నుండి 7.5 గంటల వరకూ వుండవచ్చు. కాబట్టి ఈ సమయంలో వారు మూత్రం, మలవిసర్జన జరుపవలసిన అవసరం రావచ్చు.
సూట్ ధరించినపుడు ఆ సూట్ లోపల diaper వుంటుంది. అలాగే వారికి కావలసిన ఆక్సిజన్, త్రాగడానికి నీటి సదుపాయంకూడా ఆ సూట్ లో వుంటాయి. వ్యోమగాములు స్పేస్ కాప్సుల్ లో వుండగా షర్టు, షార్ట్ వంటి తేలికైన వస్త్రాలే ధరిస్తారు.
వ్యోమగాముల దినచర్య ఏవిధంగా వుంటుంది, ఏమి తింటారు, ఎలా నిద్రిస్తారు, మల-మూత్ర విసర్జన ఎలా జరుపుతారు, ఎలా వ్యాయామం చేస్తారు అనే అన్ని ప్రశ్నలకు భారతీయ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అనే పేరుగల నాసా మహిళా వ్యోమగామి ఒక 11 నిముషాల వీడియోద్వారా చాలా వివరంగా చూపారు. పై వివరాలతోబాటు మరిన్ని స్పేస్ స్టేషన్ వివరాలు తెలుసుకోవాలంటే ఆమె వీడియోలను గమనించవచ్చు.