వాట్సాప్‌లో మెసేజ్‌లను డిలీట్ చేసే ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం విదితమే. వాట్సాప్ ఈ ఫీచర్‌ను 2017లోనే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంలో వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లతోపాటు ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయవచ్చు. కానీ వాటిని పంపిన 7 నిమిషాల్లోగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అవి డిలీట్ కావు. అయితే ఆయా మెసేజ్‌లను పొరపాటుగా డిలీట్ చేస్తే ఇంక అంతే సంగతులు. వాటిని మళ్లీ యాక్సెస్ చేయలేం. అలాగే ఇతరులు మనకు పంపే మెసేజ్‌లను వారు డిలీట్ చేసినా వాటిని మనం చూడలేం. కానీ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఓ యాప్ సహాయంతో వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా చూడవచ్చు. అందుకు గాను ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న నోటిసేవ్ (Notisave) అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. అనంతరం యాప్‌ను ఓపెన్ చేసి అన్ని పర్మిషన్లను ఇవ్వాలి. దీంతో మీ వాట్సాప్‌కు వచ్చే అన్ని రకాల మెసేజ్‌లను ఈ యాప్ ట్రాక్ చేస్తుంది. వాటిని తన దగ్గర స్టోర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో వాట్సాప్‌లో ఏ మెసేజ్‌లను అయినా సరే డిలీట్ చేస్తే వాటిని నోటిసేవ్ యాప్‌లో చూడవచ్చు. ఇలా ఈ యాప్ పనిచేస్తుంది.
ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఫ్రీ వెర్షన్‌లో యాడ్స్ వస్తాయి. కానీ పెయిడ్ వెర్షన్‌ను కొనుగోలు చేస్తే యాడ్స్ రాకుండా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌లో డిలీట్ చేయబడిన మెసేజ్‌లను చదివేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.