సాధారణంగా సినిమాల్లో నటించే హీరోయిన్స్ నిజ జీవితాల్లో కూడా ప్రేమించుకోవడం తర్వాత వివాహాలు చేసుకోవడం ఇప్పటి వరకు చూశాం. కానీ ఇందులో కొంతమంది హీరోయిన్లు మాత్రం డైరెక్టర్ లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి వారు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
సుహాసిని మణిరత్నం:
హీరోయిన్ సుహాసిని దర్శకుడు మణిరత్నం గారిని ప్రేమించి, వివాహం చేసుకున్నారు
కుష్బూ, సుందర్ :
నటి కుష్బూ కూడా డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
రోజా,సెల్వమణి :
ఓవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ఇప్పటికి కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ టీవీ షోలతో మనల్ని అలరిస్తున్న రోజా,దర్శకుడు సెల్వమణి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
శోభ,బాలు మహేంద్ర :
భారతదేశంలోని గొప్ప దర్శకులలో బాలు మహేంద్ర గారు ఒకరు.నటి శోభ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1980లో శోభ ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత బాలు మహేంద్ర గారు 1998లో మౌనిక అనే నటిని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఈ పెళ్లి గురించి 2004లో అనౌన్స్ చేశారు. బాలు మహేంద్ర గారు మొదట అఖిలేశ్వరి అనే ఆవిడ ని పెళ్లి చేసుకున్నారు.
దేవయాని,రాజ్ కుమార్ :
నటి దేవయాని రాజ్ కుమార్ అనే దర్శకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దేవయాని తల్లిదండ్రులు వీరి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో, 2001లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
రమ్యకృష్ణ,కృష్ణవంశీ
హీరోయిన్ రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణ వంశీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
నయనతార, విజ్ఞేశ్ శివన్:
లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార దర్శకుడు విజ్ఞేశ్ శివన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడు సంవత్సరాలు వీరిద్దరూ రిలేషన్ లో ఉండి పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు.