మధుమేహం, డయాబెటిస్, షుగర్.. ఇవన్నీ ఒకే వ్యాధిపేర్లు. నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో అత్యంత ప్రమాదకమైనది ఈ మహమ్మారి. చిన్నాపెద్ద, ధనిక, పేద.. అనే తేడా లేకుండా అన్నివర్గాల వారు ఈ వ్యాధిబారినపడుతున్నారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే.. ఇక మనిషి దైనందిన జీవితం మొత్తం దాని కంట్రోల్‌లోకి వెళ్తుంది. మనం ఏం తినాలి, ఏం తినకూడదు..? ఎప్పుడు తినాలి..? అమ్మో.. ఇలా సవాలక్ష షరతులు. అవన్నీ పాటించాలి. పాటించాల్సిందే తీరాల్సిందే. లేదంటే.. ఇక అంతే సంగతులు. అయితే.. ప్రపంచంలో 50 శాతం డయాబెటిస్ భారిన పడినవారు మన తెలుగు వారు ఉన్నారంటే నమ్మడం కష్టమే మరి. కానీ నమ్మి తీరాల్సిందే.
ఈ వ్యాధి ఎన్ని రకాలు ఉంటుంది? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? ఆహార నియమాలు ఎలా ఉంటాయి..? తదితర అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి.. మధుమేహం.. ఒకప్పుడు పలానా వయస్సు వారికి మాత్రమే వచ్చేది. కానీ నేడు బిడ్డ తల్లి కడుపులో ఉండగానే డయాబెటిస్ సోకుతున్న పరిస్థిలు ఉన్నాయి. పుట్టిన పసికందు నుంచి మొదలు తొమ్మిది నెలల పాపకు కూడా డయాబెటిస్ వచ్చేస్తోంది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఈ మహమ్మారి వస్తుంది. అయితే ఈ డయాబెటిస్ ఎక్కువగా అధికంగా బరువు ఉన్నవారికి, శారీరక శ్రమ లేని వారికి ఎక్కువగా వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక మరికొంతమందికి వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
మధుమేహంలో రకాలు …
ఈ వ్యాధిలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. మొదటి రకం ఇమ్యూనిటీ బీటా కణాలను, వ్యాధి నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. డయాబెటిస్‌లో రెండో రకం ఏమిటంటే.. శరీరాన్ని బీటా కణాలు తట్టుకోలేనప్పుడు అధికంగా ఇన్సులిన్ కావాల్సి వస్తుంది. ఈ రెండో రకాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ టైప్ 1 చిన్న పిల్లల్లో అధికంగా కనిపిస్తుందదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ తయారీ తగ్గిపోవడంతో మధుమేహం వస్తుంది. ఇక టైప్ 2 డయాబెటిస్ ఇన్సులిన్ ఉత్పత్తి శరీరం ఉపయోగించుకోలేదు.
వ్యాధి లక్షణాలు…
డయాబెటిస్ వ్యాధి లక్షణాల్లో ప్రధానమైనది.. ఈ వ్యాధి ఉన్న వారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. నీరు కూడా సాధారణంకన్నా ఎక్కువగా తాగుతారు. మూత్ర విసర్జన ఎక్కువసార్లు ఉంటుంది. ఇదే సమయంలో బరువు తగ్గుతారు. ఒకవేళ ఏదైనా కారణంగా గాయం తగిలితే త్వరగా మానదు. కాళ్లు, చేతులు నొప్పులు రావడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.. ఈ లక్షణాలను గమనించి ఒకసారి పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఇవి పాటించాలి…
మన దైనందిన జీవితంలో తీకునే జాగ్రత్తలే మనల్ని ఈ వ్యాధి బారిన పడకుండా చూస్తాయి. ఒకవేళ పడినా పెద్ద ప్రమాదంలేకుండా కాపాడుతాయి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఏ టైప్ డయాబెటిస్ అనేది తెలుసుకోవాలి. ప్రతిరోజు 30 నిమిషాలు నడవాలి. కనీసం వారంలో 5 రోజులు పాటు వ్యాయామం చేయాలి. ఇక అధిక బరువులు ఎత్తడం లాంటివి చేయొద్దు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలి.
ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. రాగులు, జొన్నలు, గోధుమలు, వంకాయ, బెండకాయ, దొండకాయ, మునగకాడలు, కాకర, ఆకుకూరలు, పొట్ల, కాబేజి, టమాటా, ఎక్కువగా తీసుకోవాలి, ఇంకా కుదిరితే రాగి జావ ఉదయం లేవగానే తాగాలి. ఇక సిగరేట్ మందు వంటి అలవాట్లు ఏమైనా ఉంటె వెంటనే మానుకోవాలి.