Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్యని ‘జోష్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం చేసాడు నాగార్జున, నటన నాన్నది, స్టైల్ మేనమామ వెంకిది అందిపుచ్చుకున్న నాగచైతన్య తోలి సినిమా పూర్తి కాకుండానే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేసావే’ సినిమాతో సినీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. అయితే సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ తో నాగ చైతన్య ఓ మూవీ చేయాలి. కానీ ఇది అనౌన్స్మెంట్ దశలోనే ఆగిపోయింది. అందుకు కారణాలేంటో తెలీదు కానీ నాగ చైతన్య మాత్రం చాలా హర్ట్ అయినట్టు గతంలో ఓపెన్ అయ్యాడు.
అయితే నాగ చైతన్య తన సినిమాలు ప్రకటించి ఆగిపోయినవి చూస్తే.. నాగ చైతన్య, రాధామోహన్ డైరెక్షన్ లో ‘గౌరవం’ అనే సినిమాని ప్రకటించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు.నాగచైతన్య జంటగా వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కాని సినిమా ఎందుకో ఆగిపోయింది. నాగ చైతన్య, ‘ఢమరుఖం’ ఫేమ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కాంబోలో ‘హలో బ్రదర్’ అనే మూవీని అనౌన్స్ చేశారు. కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది. హలో బ్రదర్ ‘ రీమేక్ ఆగిపోవడంతో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో దుర్గ అనే చిత్రం అనౌన్స్ చేయగా, ఈ చిత్రాన్ని సి.కల్యాణ్ నిర్మించాలి. కానీ ఎందుకో ఇది కూడా ఆగిపోయింది.
దిల్ రాజు నిర్మాణంలో శశి అనే నూతన దర్శకుడితో నాగ చైతన్య, రష్మిక కాంబోలో ‘అదే నువ్వు అదే నేను’ మూవీ చేయాలి. కానీ ఈ మూవీ కూడా ఆగిపోయింది. అక్కినేని నాగ చైతన్య మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక చిత్రం రూపొందాల్సి ఉంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి కూడా రెడీ అయ్యారు. కానీ ఎందుకో ఈ మూవీ పట్టాలెక్కలేదు. నాగ చైతన్య, పరశురామ్ కాంబినేషన్ లో ‘నాగేశ్వరరావు’ అనే సినిమా రూపొందాల్సి ఉండగా, దీని అధికారిక ప్రకటన కూడా వచ్చింది.కానీ పరశురామ్.. ఈ చిత్రాన్ని పక్కన పెట్టి, మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ చేశాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, కార్తీ అంటూ తిరగడంతో నాగ చైతన్య.. పరశురామ్ కథని రిజెక్ట్ చేశాడు.