బీన్స్ లో ఏ రకమైన తీసుకోవచ్చు. చిక్కుడు కాయలు, నల్ల చిక్కుడు లేదా కిడ్నీ బీన్స్ వంటివి ఏమైనా తీసుకోవచ్చు. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా రిలీజ్ అవుతాయి. దీని కారణంగా బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని.. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇవి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మూడు నెలల పాటు ప్రతి రోజూ ఒక కప్పు బీన్స్ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం కనబడుతుందని అంటున్నారు. కాబట్టి రెగ్యులర్‌గా మీరు వీటిని తీసుకోవడం మంచిది. ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది అని మనకు తెలిసిన విషయమే. డయాబెటిస్‌తో బాధ పడే వాళ్లు లేదా డయాబెటిస్ రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే మంచిది. ఆపిల్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా ఒక ఆపిల్ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. యాపిల్స్‌లో ఫైబర్, విటమిన్ సి ఉంటుంది. వీటిలో ఫ్యాట్ అసలు ఉండదు. మీరు ఒక మీల్‌కి మరియు మరొక మీల్‌కి మధ్యలో ఒక ఆపిల్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. కావాలంటే మీరు ఆపిల్‌ని కొద్దిగా దాల్చిన చెక్కతో కలిపి బేక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇలా మీరు కొత్త రకాలని కూడా ప్రయత్నం చేయవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
డయాబెటిస్ రాకుండా ఉండడానికి బాదం కూడా బాగా ఉపయోగ పడుతుంది. రెగ్యులర్‌గా బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. అంతే కాదండీ బాదంలో మోనో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి. కాబట్టి రెగ్యులర్ గా బాదంని కూడా మీ డైట్ లో చేర్చుకోండి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. పాలకూర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరలో మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ గా పాలకూరని కూడా మీ డైట్‌లో తీసుకోండి. పాలకూరని కొద్దిగా ఆలివ్ ఆయిల్‌లో మిక్స్ చేసి పచ్చిగా తినొచ్చు లేదు అంటే పాలక్ పన్నీర్ వంటివి చేసుకొని కూడా మీరు తినొచ్చు.
లేత పాలకూరతో మీరు స్మూథి లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. సలాడ్స్ వంటి వాటిలో కూడా దీనిని ఎక్కువగా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మంచి బెనిఫిట్స్ కలుగుతాయి కాబట్టి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. బరువును కంట్రోల్లో ఉంచుకోవడానికి చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా ఇది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. డయాబెటిస్‌తో బాధ పడే వాళ్ళు చియా సీడ్స్ తీసుకోవడం మంచిది. రీసెర్చ్ ప్రకారం డయాబెటిస్ తో బాధపడే వాళ్లు చియా సీడ్స్‌ని తీసుకోవడం వల్ల ఆరు నెలల్లో మంచి రిజల్ట్ కనిపించిందని నిపుణులు అంటున్నారు.