సాధారణంగా చపాతీలను కేవలం నార్త్ ఇండియన్స్ మాత్రమే కాదు, మన దగ్గర కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చపాతీలను తినడం వల్ల రుచికి రుచే కాదు, పోషకాలు కూడా మనకు లభిస్తాయి. ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే డాక్టర్లు కూడా రోజూ రాత్రి అన్నం మానేసి చపాతీలను తినమని సలహా ఇస్తుంటారు. కాకపోతే చపాతీలు తినే ముందు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చపాతిని చాలా తక్కువ నూనేతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి.
అసలు నూనే వేయకుంటే మరింత మంచిది. ప్లేట్ నిండుగా భోజనం చేసినా 2, 3 చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. ఇక చపాతీలను గోధుమ పిండితో చేస్తారని అందరికీ తెలిసిందే.
అయితే గోధుమల్లో విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. మరియు మనదేశంలో ఎక్కువ మంది రక్త హీనతతో కూడా బాదపడుతున్నారు..చపాతి తినడం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు.