జీవ మానవాళి పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త రోగాలు, వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. భయంకర వైరస్ లు పుట్టుకొచ్చి ప్రాణాలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కూడా అలాంటిదే. అలాగే ప్రాణాంతకమైన రోగాల్లో హైపటైటిస్ ఒకటి. ఈ వ్యాధి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కాలేయంలో కొవ్వు పెరిగితే హెపటైటిస్ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. ప్రస్తుత తరణంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
సాధారణంగా మానవ శరీరంలోని కాలేయంలో కొంత కొవ్వు ఉంటుంది. మోతాదుకు మించి కొవ్వు పేరుకుపోతే హెపటైటిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. మనిషి ఆల్కహాల్ ను సేవించడం ద్వారా ఒక రకమైన కొవ్వు తయారైతే.. ఆల్కహాల్ తాగకుండా కుండా వేరే రకం కొవ్వు ఉత్పన్నం అవుతుంది. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవడానికి తరచూ యోగాలు, ఎక్సర్ సైజ్ లు చేస్తూ అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
ప్రస్తుతం జంక్ ఫుడ్ కు ప్రజలు అలవాటు పడ్డారు. ఆయిల్ ఎక్కువగా వాడి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, ఫ్రైలు చేసుకోవడంతో వల్ల శరీరంలో, లివర్ లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లివర్ లో కొవ్వు పెరిగితే మంటగా అనిపిస్తుంది. అది చివరకు ప్రాణాలు తీసే ప్రమాదం కూడా ఉంది. ఈ హెపటైటిస్ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కాలేయంలో కొవ్వు శాతం పెరుగుతున్న విషయం పూర్తిగా పాడై, బాగు చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడే ఈ లక్షణాలు బయట పడుతాయి. అందుకే దీనిని సైలంట్ కిల్లర్ అని పిలుస్తారని డాక్టర్లు వెల్లడించారు.