భార్య, భర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే.. వారి జీవితం ముందుకు సాగుతుంది. కానీ కొంత మంది పెళ్లి అయినప్పటి నుంచీ.. ప్రతీ దానికి గొడవ పడుతూనే ఉంటారు. చిన్న, చిన్న వాటికి.. భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు అరుస్తూ ఉంటారు.
అయితే.. ఎక్కువగా.. భార్యలను భర్తలు మాత్రం చిన్న కారణం చెప్పి.. కొడతారు. అసలు భర్తలు అలా కొట్టడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భార్యలు తమ భర్తలకు చెప్పకుండా బయటకు వెళుతున్నారనే కారణంగానే ఎక్కువ మంది కొడతారని నిపుణులు చెబుతున్నారు.
ఇక మరికొందరు భర్తలు.. భార్య చెప్పిన మాట వినడం లేదు.. పిల్లలను సరిగా చూసుకోవటం లేదు… వంట సరిగ్గా చేయడం లేదు… మరియు రాత్రి కలయికలో తిరస్కరిస్తుందని.. ఇలాంటి కారణాలతో కూడా కొడతారట. అంతే కాకుండా… చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం.. అక్రమ సంబంధాలు, భార్యలపై అనుమానం, భర్త తరఫున బంధువులకు మర్యాద ఇవ్వకపోవడం.. ఇలా చాలా కారణాల వల్ల.. భార్యలను కొడతారట.