జలుబు చేసినప్పుడు మనకు సహజంగానే ముక్కు దిబ్బడ వస్తుంటుంది. ముక్కు రంధ్రాలు పట్టేసి గాలి ఆడకుండా అయిపోతాయి. దీంతో నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వస్తుంటుంది. ఇక కొందరికి జలుబు ఉండకపోయినా అప్పుడప్పుడు ముక్కు దిబ్బడ వస్తుంటుంది. దీంతో రాత్రిళ్లు నిద్రపోలేకపోతుంటారు. అయితే కింద ఇచ్చిన చిట్కాను పాటిస్తే ముక్కు దిబ్బడ, జలుబు త్వరగా తగ్గుతాయి. మరి ఆ చిట్కా ఏమిటంటే..
ముక్కు దిబ్బడ, జలుబును తగ్గించేందుకు వాము అద్భుతంగా పనిచేస్తుంది. వాము, ఉప్పులను సమభాగాలుగా చేసి వాటిని బాగా దంచి పొడిలా చేయాలి. అనంతరం ఆ పొడిని చిన్నపాటి గోలీల్లా తయారుచేసుకోవాలి. వాటిని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఆ గోలీ ఒక్కదాన్ని తీసుకుని రోజూ రాత్రి నిద్రించేముందు చప్పరించాలి. ఇలా చేస్తే త్వరగా ముక్కు దిబ్బడ తగ్గుతుంది. జలుబు కూడా తగ్గిపోతుంది.
వాముతో తయారు చేసే ఆ గోలీలను ఆయా సమస్యలు ఉన్నప్పుడల్లా వాడుకోవచ్చు. జలుబు చేసిందని, ముక్కు దిబ్బడ వచ్చిందని తరచూ ఇంగ్లిష్ మెడిసిన్ వాడేవారు ఈ చిట్కా పాటించి ఆ రెండు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో తరచూ ఆయా సమస్యలు రాకుండా ఉంటాయి.