తల్లి అకాల మరణం చెందడంతో, నడివయసులో ఉన్న మీ తండ్రి ఒంటరితనం భరించలేక మరొక వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు, అందుకు మీరు కూడా సమ్మతి తెలియజేయడం మంచి విషయమే.. కానీ అసలైన సమస్య ప్రశ్నలోని రెండో భాగంలో ఉంది..మీ తండ్రి గారు మరొక వివాహం చేసుకున్నా కూడా మీ పిన్ని గారి వల్ల సంతానం కనకూడదు అని ఎందుకు కోరుకుంటున్నారు.? ఈ వయసులో మీ తండ్రి పిల్లల్ని కంటే, సమాజంలో బంధువుల్లో వెక్కిరింతలకు గురవుతారని భావిస్తున్నారా? లేదంటే మీ తండ్రి రెండవ భార్య వల్ల సంతానాన్ని పొందితే , మీకు ఆస్థిలో వాటా తగ్గుతుంది అని భావిస్తున్నారా?
ముందే చెప్పినట్లు గా ఇది మీ కుటుంబ సమస్య..లోతుగా వెళ్ళాలి అనుకోవడం లేదు..కానీ మొదటి పాయింట్ సమాజానికి భయపడి అయితే అస్సలు పట్టించుకోవాల్సిన పనిలేదు..సాటి మనిషి కష్టం గురించి.పట్టించుకోవడానికి సమయం లేని స్వార్థపూరిత సమాజం లో ఉంటున్నాం మనం.. ఇక పోతే రెండవ పాయింట్..మీరు ఆస్థిని దృష్టిలో పెట్టుకొని సంతానాన్ని కనడానికి ఒప్పుకోవట్లేదు అనుకున్నా..
మీ తండ్రి ఆస్తి తాత నుంచి వచ్చింది అనుకోండి, ఆ ఆస్తిలో మనువలు అందరికీ సమాన హక్కు ఉంటుంది..మీ నాన్న గారికి రెండవ పెళ్ళి వల్ల కలిగే సంతానం తో సహా.. కాదు మీ తండ్రి ఆస్తి స్వార్జితం అనుకోండి, ఆయన ఆస్తి ఆయన ఇష్టం, మొదటి భార్య సంతానానికి కాదు, రెండవ భార్య సంతానానికి కాదు, ఏదైనా అనథాశ్రమం, ఏదైనా దేవస్థానం దేనికైనా ధారపోసేసే హక్కు ఆయన సొంతం.. ఇక్కడ ప్రశ్న మీదే, సమాధానం కూడా మీ దగ్గరే ఉంది..