జుట్టు ఒత్తుగా, దృఢంగా, పొడవుగా ఉండాలని ఆడవారెవరైనా కోరుకుంటారు. అందుకోసం వారు రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటిలో అన్నీ విజయవంతం కావు. అయినప్పటికీ వారు తమ ప్రయత్నాలను మాత్రం ఆపరు. ఈ క్రమంలో అలా జుట్టు బాగా పెరగాలని కోరుకునే వారు ఇప్పుడు మేం చెప్పబోయే సింపుల్ టిప్స్‌ను పాటిస్తే కేవలం వారం రోజుల్లోనే జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పును గమనిస్తారు. దీంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు, వెంట్రుకలు ఎంతో ప్రకాశవంతంగా, మృదువుగా మారుతాయి. ఆ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు కోడిగుడ్లు, ఒక టేబుల్ స్పూన్ ఆవనూనెను తీసుకోవాలి. కోడిగుడ్లను పగలగొట్టి ఆవనూనెలో బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని తలపై పోస్తూ జుట్టు కింద వరకు పాకేలా మసాజ్ చేస్తూ బాగా రుద్దాలి. కనీసం 4 నిమిషాల పాటు ఆ మిశ్రమంతో జుట్టను బాగా మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్లకు మిశ్రమం తాకాలి. తరువాత జుట్టుకు ఓ ప్లాస్టిక్ కవర్‌ను చుట్టి గంట పాటు అలాగే ఉండాలి. అనంతరం నీటితో కడిగేయాలి. రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. వేడి చేసిన కొబ్బరి నూనె చల్లారుతుండగా పైన చెప్పినట్టుగా జుట్టు పైన నుంచి కింద వరకు పోస్తూ మసాజ్ చేయాలి. మళ్లీ దానికి ప్లాస్టిక్ కవర్ చుట్టేయాలి.
రాత్రంతా ఆ కవర్‌ను అలాగే ఉంచాలి. ఉదయాన్నే కవర్‌ను తీసేసి తలస్నానం చేయాలి. పైన చెప్పిన టిప్స్‌ను పాటిస్తూ జుట్టును సంరక్షించడం వల్ల మొదటి రోజు నుంచే మీరు జుట్టు పెరుగుదలలో మార్పును గమనిస్తారు. వారం అయ్యే సరికి మీ జుట్టు ఎంతో ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. వెంట్రుకలు బాగా పొడవుగా పెరుగుతాయి.