హార్ట్ ఎటాక్… ఈ పేరు చెబితే చాలు, ఊబకాయలు ఒకింత ఆందోళన చెందుతారు. ఆ మాట కొస్తే గుండె జబ్బులంటే ఎవరికైనా భయమే. ఎందుకంటే అవి కలిగించే నష్టాలు అలాంటివి మరి. మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు వీలైనంత త్వరగా రోగికి చికిత్స అందించాలి. ఇది ఆ రోగికి తరువాతి సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఆ సమయంలో సరిగ్గా స్పందించకపోతే ఇక తరువాత ఎప్పుడైనా హార్ట్ ఎటాక్ వస్తే వారిని రక్షించడం కష్టతరమవుతుంది. అయితే హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు కింద ఇచ్చిన విధంగా స్పందిస్తే రోగికి కలిగే నష్టాన్ని వీలైనంత వరకు దూరం చేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొదటి 10 సెకండ్లలో చురుగ్గా ఉండి స్పందించాల్సి ఉంటుంది. హార్ట్ అటాక్ రాగానే ఎవరైనా ముందుగా ఆంబులెన్స్ పిలుస్తారు. అయితే ఆ సమయంలో రోగి ఏం చేయాలంటే లోపలికి బాగా శ్వాస తీసుకుని దాన్ని దగ్గు రూపంలో బయటికి వదలాలి. అలా బాగా ఎక్కువగా శ్వాస తీసుకుని పెద్దగా, గట్టిగా దగ్గాలి. దీన్ని 2 సెకండ్లకు ఒకసారి చేయాల్సి ఉంటుంది.
ఇలా చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ లోపలికి వెళ్లి ఊపిరితిత్తులకు చేరుతుంది. దీంతో గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. రక్త సరఫరా పెరుగుతుంది. ఇలా చేస్తే శ్వాస క్రియ సహజ స్థితికి వస్తుంది. దీంతో ఆంబులెన్స్ వచ్చే వరకు ఆందోళన చెందకుండా ఉండవచ్చు.