ఒక్క వ్యక్తి తన చుట్టూ ఉన్న వారి తల రాతలు మార్చేశాడు అన్న కాన్సెప్ట్ మనము ఛత్రపతి సినిమా లో చూసాము .. కానీ నిజ జీవితం లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారని, హిట్లర్ చరిత్ర చూస్తుంటే అర్ధం అవుతూ ఉంటుంది. 1919 లో హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీ లో చేరాడు, అది చిన్నగా నాజి పార్టీ కింద మారింది. అప్పుడే జర్మనీ మొదటి ప్రపంచం యుద్ధం ఓడిపోయిన డిప్రెషన్ లో ఉంది. అంచెలంచెలుగా నాయకుడి లాగా ఎదుగుతూ 1933 లో జర్మనీ కి ఛాన్సలర్ అయ్యాడు. ఆ తరువాత ఒక నియంత గా మారి వేరే దేశాల మీదకు దండయాత్రకు వెళ్లి ప్రపంచం యుద్ధం ఏర్పడడానికి కారణం అయ్యాడు. జర్మనీ కి నాయకుడిగా ఆయన మీద ప్రజలకు ఉన్న భావాలు ఏంటి అని పక్కన పెడితే ఒక నాయకుడిగా, నియంతగా హిట్లర్ చేసిన మంచి పనులు ఏంటో చూద్దాము.
జర్మనీ లో హిట్లర్ ఎన్నో రహదారులను నిర్మించాడు, దాని వలన చాల మంది జర్మనీ ప్రజలకు ఉద్యోగాలు లభించాయి. అంతే కాకుండా ఆర్ధికంగా జర్మనీ కూడా కోలుకుంది. జర్మనీ సైనిక వ్యవస్థను హిట్లర్ పటిష్టంగా మార్చాడు. ఎయిర్ ఫోర్స్ ని స్థాపించే దిశగా హిట్లర్ అడుగులు వేసాడు. ఆటో మొబైల్ పరిశ్రమ లో జర్మనీ కి ఈ రోజు కూడా మంచి పేరు ఉంది. హిట్లర్ తన హయం లో వాక్స్వాగన్ కార్ ను ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు ఉండేల చేసాడు. హిట్లర్ తమ పక్క దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించేవారు. 1938 కి ఆస్ట్రియ ని జర్మనీ లో కలిపాడు. 1936 లో జర్మనీలో ఒలింపిక్స్ జరిగాయి.. 49 దేశాలు అందులో పాల్గొన్నాయి .. ఇది జర్మనీ యొక్క ఆర్ధిక వ్యవస్థకు బాగా ఉపయోగ పడింది.
హిట్లర్ ధూమపానానికి వ్యతిరేకంగా ఉండేవాడు. తమ దేశ ప్రజలు, ముఖ్యంగా గర్భవతులను ధూమ పానం కి దూరంగా ఉండేలా వివిధ కార్యక్రమాలు చేపట్టే వాడు. హిట్లర్ కు జంతువులు అంటే మహా ఇష్టము. వాటికి కూడా హక్కులను కలిపించేవాడు. ముఖ్యంగా సరదా కోసం వేటాడేవారిని కట్టడి చేసాడు. ఎక్కడన్నా ట్రాప్స్ లాంటివి పెట్టె ప్రక్రియను పూర్తిగా తీసేయాలని ఉత్తర్వులు జారీ చేసాడు. హిట్లర్ పోలాండ్ మీద దండయాత్ర చేయకపోయిన, లేదా జ్యూస్ మతం పట్ల ద్వేషం లేకపోయిన బహుశ చరిత్ర వేరేలా ఉండేది.