మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఆహారాలను తినే దృశ్యం చూసారా? ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఎంత సమయం పట్టిందో అంచనా వేయండి? బహుశా 2-3 గంటల సమయం పట్టి ఉంటుంది. అదే ఇప్పుడు ఇలాంటి సన్నివేశం తీయడానికి, pre-cgi, cgi, final touches అని చెప్పి ఒక వారం లాగేస్తారు. సాంకేతికత పెరగడం వల్ల సినిమా చిత్రీకరించడం సులభం అయిపోయినా, అదే సాంకేతికతను వాడుకోవడానికి సమయం పడుతోంది.
ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూద్దాం: అప్పట్లో కృష్ణ ఒక సంవత్సరం 13-14 సినిమాలు విడుదల చేసేవారు. ఒకే రోజు 2-3 చిత్రాల సెట్స్ లో కనిపించేవారు. అబ్బో! ఇలా వేరు-వేరు సినిమాలు ఒకే సారి చేయడం చాలా కష్టం, కానీ వాళ్లు చేసేసేవారు. ఇప్పుడు చూస్తే ఆయన కొడుకు మహేష్ బాబు ఒక్కో సినిమాకి 45 రోజులు విశ్రాంతి సమయం తీసుకుంటారు. నిజం చెప్పాలంటే, అప్పటి హీరోలలా ఇప్పటి వాళ్ళు కష్టపడట్లేదు.
ఇప్పుడు సినిమాలకి భారీ సెట్లు, కొత్త-కొత్త లొకేషన్లు అంటారు. ఆ లొకేషన్ కి వెళ్ళడానికి, అక్కడ షూటింగ్‌లు చేయడానికి చాలా సమయం పడుతుంది. అదే అప్పట్లో, ఒక స్టూడియోలో సినిమా అంతాషూట్ అయిపోయేది. పెద్దగా లొకేషన్లు వాడకపోవడం వల్ల, అనిల్ రావిపూడి వంటి దర్శకుల సినిమాల షూటింగ్ 45-60 రోజుల్లో అయిపోతుంటాయి.
సినిమా రాయి అంత, కానీ ప్రమోషన్ కొండంత: pre-teaser, teaser, first-look, pre-trailer, trailer, pre-release, audio-release, బోలెడన్ని ఇంటర్వ్యూలు. వీటిని ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికి చాలా సమయం పడుతుంది. అప్పట్లో ఇదే సమయంలో ఇంకో సినిమా తీసేవారు. ఇంకా చాలా కారణాలు ఉన్నా, ఈ మూడు కారణాల వల్ల ఈ కాలంలో సినిమాలు తీయడానికి ఎక్కువ సమయం పడుతోంది.