ఒక సినిమాలో వెన్నెల కిషోర్ ని యాంకర్ అడుగుతాడు .. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ? అని .. వెన్నెల కిషోర్ అంటాడు .. నాకు ఎలా వచ్చింది అని కాకుండా అసలు మీకు ఈ ఆలోచన రానందుకు సిగ్గు పడండి అని గాలి తీస్తాడు .. కరెక్ట్ గా అలాగే ఆలోచిస్తే .. అసలు మనము ఎందుకు చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాము ? అనే కంటే మనము ఎక్కడ ఫెయిల్అం అవుతున్నాం… అని ఆలోచిస్తే దానికి సింపుల్ గా ఒకటే సమాధానం.. చైనా కు ఉన్న ఉన్న ముందు చూపు, ప్లానింగ్, కష్టపడాలి అన్న తపన. చైనా దగ్గెర తాయారు చేయబడే ముడి సరుకు( RAW MATERIALS ), పారిశ్రామిక వస్తవులు ( Industrial goods). మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రకరకాల ముడి సరయూకు ఖరీదు 387 బిలియన్ డాలర్స్ …
అంతకన్నా చైనా ఇక్కడ పొడుస్తుంది ఏంటి … మనకు వారు ఎగుమతి చేస్తున్న వస్తువులు ఏంటి అని చూస్తే అవి.. 1) టెలికాం గేర్స్, 2) మెషినరీ, 3) ఎలక్ట్రానిక్స్. 15 ఏళ్ళ క్రితం మనం వారి నుంచి కేవలం 21 % వస్తువులు మాత్రమే దిగుమతి చేసుకునేవాళ్ళం.. కానీ ఇప్పుడు అది 30 % కు పెరిగింది.. 2022 లో, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లాంటి పరికరాలు దాదాపు మనం 4 బిలియన్ డాలర్ల వరకు వారి దగ్గర కొనుక్కున్నాం. దేని వలన ? మన దగ్గర ఆ ఫ్యాక్టరీస్ కానీ సదుపాయాలు కానీ లేవు .. అంతే కాకుండా ఆ ఎలక్ట్రానిక్స్ తయారు చేయడానికి పేటెంట్ రైట్స్ కావాలి .. అలాంటివి చైనా దగ్గెర 8,00,000 పేటెంట్స్ ఉన్నాయి .. చైనా ఫ్యాక్టరీలు యావత్ ప్రపంచానికి 28 % వస్తువులను ఎగుమతి చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు ..
మరో కారణం ఏంటి అంటే చైనా వారు వేరే దేశాలకు పరికరాలు అమ్మాల్సి వస్తే .. ఈ సైజు లో ఈ షేప్ లో కావాలి అంటే వారు తయారు చేయగలరు, అంతే కాకుండా చాలా త్వరగా చేయగలరు .. అందుకే చైనా కాకుండా వేరే వారు ఆ స్థానాన్ని తీసుకోవడం అంత సులువు కాదు. –> మరో కారణం ఏంటి అంటే వారు తయారు చేయడానికి అయ్యే ఖర్చు చాలాతక్కువ .. దాని వలన మనకు చాలా తక్కువ ఖర్చులో ముడి సరుకు దొరుకుతుంది .. ఉదాహరణకు మందులు తయారు చేయడానికి API లు కావాలి .. అది మనకు చైనా వాళ్లే ఇస్తారు ..ముఖ్యంగా వీటి తయారీ కి అయ్యే ముడి సరుకు, కరెంటు, లేబర్, ఇతర ఖర్చులు కలిపి ఇండియాకు మందుల తయారీకి ఎక్కువ అవుతుంది .. అదే చైనా ఈ విషయంలో చాలా తక్కువ ధరకు మందులు అమ్ముతుంది , పరిస్థితి ఇప్పుడు కొద్దిగా మారుతున్నది ..భారత్ చిన్నగా పుంజుకుంటుంది.
–> లేబర్ నియమాలు కూడా అక్కడికి ఇక్కడికి చాలా తేడాలు ఉన్నాయి .. అక్కడ 12 గంటలు లేబర్ పని చేయాలి. ఇండియా చైనాని దాటాలి అంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడ పెట్టాలి .. ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి .. ముఖ్యంగా ప్రభుత్వం పరిశ్రమలు పెట్టడానికి ఎన్నో వెసులు బాట్లు కల్పించాలి. కాకపోతే అన్ని దాటుకొని మన సొంతంగా పరిశ్రమలు పెట్టి మనం ముడి సరుకు కోసం చైనా వైపు చూడకూడదు అంటే ఇది ఒక 25 – 30 సంవత్సరాలు కనీసం పట్టేలా ఉంది. ముఖ్యంగా మన దేశంలో ప్రజలకు అన్ని ఉచితంగా కావాలి కదా .. టాక్స్ కట్టే వారు మన దేశం లో కేవలం 4.8 % జనాభా .. యువకుల్లో 6.3 % .. ఇలా ఉంది మన పరిస్థితి .. ఇంకా ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టే వారు ఎంత మంది ?
అన్ని ఫ్రీ గా కావాలి అని కోరుకునే వారు దాదాపు 80 % కంటే ఎక్కువగా ఉన్నారు .. మనకు భూమి కానీ వనరులు కానీ ఏమీ తక్కువగా లేవు .. కానీ పని చేయాలి అన్న తపన మటుకు కచ్చితంగా తక్కువ ఉంది.. ఇలాగే మనం ఫ్రీ వస్తవులు గవర్నమెంట్ ఇవ్వాలి అని కూర్చుంటే .. ఈ దిగుమతుల కోసం మనం పూర్తిగా చైనా మీద ఆధార పడాల్సి వస్తుంది. అప్పుడు , ఏదో ఒక రోజు ఎగుమతులు దిగుమతులు ఇండియా చైనా మధ్యన జరగాలి అంటే, మాకు సింపుల్ గా అరుణాచల్ ప్రదేశ్ కావాలి అని అడిగినా అడుగుతారు.. కష్టే ఫలి అన్నారు కానీ ఫ్రీయే( free) ఫలి అనలేదు. మనకు ఉన్నంత యువత బయట ఏ దేశం లో లేదు అని కాలర్ ఎగరేసి తిరగడం మన నేతలకు అలవాటు అయింది. నిజమే, 30 ఏళ్ళు ఆగండి అదే యువత వృద్దులు అవుతారు .. అప్పుడు మీరే వాళ్ళను పోషించాలి ..