విమానం ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతున్నప్పుడు తెల్లటి చారలను మనం చూస్తుంటాం. భూమికి తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఇవి మనకు కనిపించవు. ఈ తెల్లటి రేఖలు చాలా సేపటి వరకూ అలాగే ఉంటాయి. ఇలా వచ్చే రేఖలను చాలా మంది విమానం నుంచి వచ్చే పొగగా భావిస్తారు. అయితే అందులో నిజం లేదు. నిజానికి ఇది విమానం లేదా, హై స్పీడ్ జెట్ల నుంచి వచ్చే ఆవిరి. హై స్పీడ్ జెట్లు విడుదల చేసే ఈ ఆవిరిని చూసి మనం పొగగా భావిస్తాం.
భూమికి చాలా ఎత్తులో విడుదల చేసే ఈ ఆవిర్లు.. చల్లటి గాలితో కలిసి మంచు బిందువులను ఏర్పరుస్తాయంట. ఆ స్నోఫ్లేక్‌లను మనం చాలా కాలంగా పొగగా భావిస్తాము. భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తులో వాతావరణం చల్లగా ఉంటుంది. హై-స్పీడ్ జెట్‌లు వేడి నీటి ఆవిరిని బయటకు విడుదల చేస్తాయి. అది చల్లని గాలి ద్వారా స్తంభింపజేస్తుంది.
ఈ ఘనీభవనం గాలిని కాసేపు అలా నిలుస్తుంది. నిజానికి విమానం లేదా హై స్పీడ్ జెట్ల నుంచి వచ్చే పొగ కింద నుంచి కనిపించదు. ఇక ఈ చారలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు కనిపించవు. వాతావరణం చల్లగా లేనప్పుడు ఈ తెల్లటి స్నో ఫ్లేక్స్ ఏర్పడవు అంటున్నారు నిపుణులు.