సూపర్ పవర్స్ అనేవి ప్రపంచానికి కొత్త ఏమి కాదు .. తూర్పు నుంచి మధ్య తూర్పు దేశాలకు, అటునుంచి పశ్చిమ దేశాలకు ఈ సూపర్ పవర్ అనేది మారుతూ పోయింది .. ఎవడు పెద్ద దాదా అయితే వాడు సూపర్ పవర్ అన్నట్టు సాగింది. రోమన్ ఎంపైర్: 2 వ శతాబ్దం లో రోమన్ సామ్రాజ్యం అనేది సూపర్ పవర్ గా నిలిచింది.. రోమన్ సామ్రాజ్యం అనేది భారత్ దాకా లేదా చైనా దాకా చేరకపోయిన కూడా మిడిల్ ఈస్ట్ లో మటుకు చాలా బలంగా ఉండేది. ఈ రాజ్యం లో 60 మిలియన్ ల జనాభా ఉండేవారు .. ఇందులో ఈజిప్ట్, గ్రీస్, లెవంట్, కార్తేజ్, అనటోలియా, ఇటలీ లాంటి ఎన్నో దేశాలు ఈ రోమన్ సామ్రాజ్యం చక్రవర్తుల చేత పాలించబడింది. ఈ సామ్రాజ్యం ఎంత విలావసవంతంగా ఉండేది అంటే వాళ్లకి సామానులువేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు.
ఒక్క పర్షియా మాత్రమే వీళ్ళని తట్టుకొని నిలబడగలిగింది . రోమన్ ఎంపైర్ కుప్పకూలడానికి కారణం లోలోపల జరిగిన సివిల్ గొడవలు, లేదా అంతర్గత సమస్యలు. మంగోల్ ఎంపైర్ : ఈ ఎంపైర్ ఇంకా రాడ్ ఎంపైర్ .. మొత్తం ఆసియ ఖండమే కాకుండా, ఐరోపా లో చాలా భాగాలను వీళ్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వీళ్ల దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, వార్ ఫేర్ కానీ చాలా అద్భుతంగా ఉండేది ఆ సమయానికి. టెమూజిన్ అనే ఒక వార్ లార్డ్ ఉన్న కొండ జాతి వారందరిని ఒక తాటి మీదకి తీసుకు వచ్చాడు. అతనే జంగిస్ ఖాన్.. ఇతను రష్యా, చైనా, తూర్పు యూరోప్, మిడిల్ ఈస్ట్ అన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
బ్రిటిష్ ఎంపైర్: బ్రిటిష్ ఎంపైర్ గురించి మనకు పూర్తిగా తెలిసిందే .. దాదాపు 25 % భూమి మీద ఉన్న నేలను వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు .. ప్రపంచాన్ని చాలా రోజులు శాసించారు. 18వ శతాబ్దం నుచి దండయాత్రలు మొదలుపెట్టారు . 20 వ శతాబ్దం వచ్చేసరికి సూపర్ పవర్ గా మారారు.. అన్ని దేశాల్లో వీళ్ళ ఉనికి ఉండటం వలన .. ” Sun never set on British empire ” అని అనేవారు .. చాలా మంది లోకల్ రాజులను తమ జండా కింద ఉండేలా చూసుకున్నారు.ముఖ్యంగా భారత్, ఈజిప్ట్, కెనడా లో.
సోవియెట్ యూనియన్: ఈ దేశం కొన్ని రోజులు సూపర్ పవర్ అయ్యే దిశగా అడుగులు వేసింది .. రష్యన్ ఎంపైర్ నుంచి జనాభా కానీ నేల కానీ వారి సొంతం అయింది.. వాళ్ళని జయించడం హిట్లర్ కి కూడా కష్టం అయింది. వీళ్ళకి ఉన్న పెద్ద బలం ఏంటి అంటే తమ నేల మీద ఉండే వాతావరణం మార్పులు, దీని వలన శత్రు దేశాలకు ఎక్కువ రోజులు వీరి మీద విజయం సాధించి ఆ మారే వాతావరణం లో నిలబడగలిగే సామర్ధ్యం ఉండేది కాదు. 20 వ శతాబ్దం మొదట్లో సోవియెట్ యూనియన్ ఏర్పడింది. USA : ఇది ఈ రోజుల్లో నిఖార్సయిన గ్లోబల్ పవర్ .. వరల్డ్ వార్ 2 తరువాత నుంచి ఇదే సూపర్ పవర్ గా ఉండిపోయింది.. వీళ్ళని ఢీకొనే సత్తా ఇప్పట్లో చైనాకి మాత్రమే ఉంది ..