జిహ్వకో రుచి అన్న చందంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండవు. వేర్వేరుగా ఉంటాయి. అది ఏ అంశంలోనైనా కావచ్చు. ఒకరి అభిప్రాయం మరొకరితో సరిపోకపోవచ్చు. కానీ జంటల విషయానికి వస్తే కొందరికి మాత్రం దాదాపుగా ఒకే రకమైన అభిప్రాయాలు ఉంటాయి. అదీ శృంగారం విషయంలో. కొందరు రాత్రి శృంగారమంటే ఆసక్తి చూపితే, మరికొందరు పగలు శృంగారానికి ఓటేస్తారు. అయితే ఈ విషయంలో ఏ జంట అభిప్రాయం ఎలా ఉన్నా ఆయుర్వేదం, సైన్స్ ప్రకారం శృంగారంలో పాల్గొనేందుకు పలు సమయాలు అనుకూలంగా ఉంటాయట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేద ప్రకారమైతే అర్ధరాత్రికి ముందుగా శృంగారంలో పాల్గొంటే మంచిదట. దాంతో శృంగారానికి, నిద్రకు మంచి సమయం ఉంటుందట.
అంతే కాదు, చంద్రుడు పూర్తిగా ఆకాశంలో ఉన్న పున్నమి రాత్రి సమయంలో, మృదువైన, మెత్తని సిల్క్ వస్త్రాలను వేసుకుని, చక్కని మృదుమధురమైన సంగీతం నడుమ, మిఠాయిలను తినిపించుకుంటూ, పూలు, అత్తరు సువాసనల నడుమ శృంగారంలో పాల్గొనాలట. ఇది ఆయుర్వేదం చెప్పింది. మరి సైన్స్ ప్రకారమైతే శృంగారంలో పాల్గొనేందుకు ఏ సమయం అనువుగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఉదయం 6 నుంచి 8 మధ్య. ఈ సమయంలో పురుషులకు శృంగార వాంఛ ఎక్కువగా ఉండడమే కాదు, ఆ సమయంలో వారి పవర్ బాగా ఉంటుందట. కానీ మహిళలకు ఆ సమయంలో అంతగా ఆసక్తి ఉండదట. కనుక ఈ సమయం జంటలకు అనువుగా ఉండదట. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య. ఈ సమయంలో ఎండార్ఫిన్లనబడే హార్మోన్లు విడుదలవడం వల్ల స్త్రీలకు శృంగార వాంఛ పెరుగుతుందట. కానీ పురుషుల్లో అదే సమయంలో కొంత ఆ వాంఛ తగ్గుతుందట. కానీ ఇద్దరికీ అనుమతి అయితే ఈ సమయంలో శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చట.
మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య.. ఈ సమయంలో స్త్రీ, పురుషులు ఇద్దరికీ బిజీ వర్క్ ఉండి శృంగార వాంఛ, పవర్ తగ్గుతుందట. కనుక ఈ సమయం జంటకు అనువుగా ఉండదట. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య.. ఈ సమయంలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందట. అంతే కాదు పురుషుల నుంచి విడుదలయ్యే వీర్యం కూడా నాణ్యమైందిగా ఉంటుందట. కనుక ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే పిల్లలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అదే వారు అవసరం లేదనుకుంటే ఈ సమయంలోనూ శృంగారంలో పాల్గొనకూడదు. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల మధ్య.. ఈ సమయంలో స్త్రీ, పురుషులిద్దరికీ బాగా ఆకలి వేస్తుందట. అంతేకాదు, శృంగార వాంఛ, పవర్ తక్కువగా ఉంటుందట. కనుక ఈ సమయం కూడా శృంగారానికి అనువు కాదు.
రాత్రి 8 నుంచి 10 గంటల వరకు.. ఈ సమయంలో ఇద్దరిలోనూ శక్తి నిల్వలు పెరిగి శృంగారానికి అనువుగా తయారవుతారట. కనుక ఈ సమయం శృంగారానికి అత్యంత అనువైందట. రాత్రి 10 నుంచి 12 గంటల వరకు.. స్త్రీ, పురుషులు శృంగారంలో పాల్గొనేందుకు ఇది కూడా అనువైన సమయమేనట. ఎందుకంటే ఆ సమయంలో వారి హార్మోన్లు బాగా ఎక్కువగా పనిచేస్తుంటాయట. మనుషులు తమకు ఏయే వయస్సు వచ్చే సరికి ఏమేం చేయాలో కూడా ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అవేమిటంటే.. 0 నుంచి 25 సంవత్సరాల వరకు – బాల్యదశ, విద్యార్థి దశ, ఉద్యోగి దశ, 25 నుంచి 50 సంవత్సరాల వరకు – గృహస్తు దశ (ఇల్లు, కుటుంబం, పిల్లలు, సంసారం), 50 నుంచి 65 సంవత్సరాల వరకు – బాహ్య ప్రపంచం నుంచి సంబంధం ఉండదు, అన్ని పనులకు రిటైర్మెంట్ ప్రకటించాలి, 65 ఏళ్ల తరువాత – మరణం లేదా, సన్యాసం.
వేసవి కాలంలో కన్నా శీతాకాలంలోనే ఎక్కువగా శృంగారంలో పాల్గొనాలని ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాదు, స్త్రీలు గర్భం దాల్చాక, రుతు సమయంలో, బాగా భోజనం చేసిన తరువాత శృంగారంలో పాల్గొనకూడదట. అలా చేస్తే గ్యాస్ ఎక్కువగా ఉద్భవిస్తుందట.