Chest Congestion : ప్రస్తుత తరుణంలో చాలా మందిని దగ్గు, జలుబు సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చలి తీవ్రంగా ఉండడం వల్ల శ్వాస కోశ సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో చాలా మందికి అవస్థ కలుగుతోంది. మరోవైపు కరోనా కారణంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
అయితే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఛాతిలో కఫం ఎక్కువగా ఉంటుంది. కనుక దాన్ని తొలగించి ఊపిరితిత్తులను శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయాలి. దీంతో దగ్గు, జలుబు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మరి ఊపిరితిత్తులను శుభ్రం చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఊపిరితిత్తులను శుభ్రం చేసి ఛాతిలోని కఫాన్ని తొలగించుకోవాలంటే అందుకు కింద తెలిపిన డ్రింక్‌ను వరుసగా 3 రోజుల పాటు తాగాల్సి ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేయాలంటే..
ఒక గ్లాస్ నీటిలో చిన్న అల్లం ముక్క, కొద్దిగా మిరియాల పొడి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కలను వేసి బాగా మరిగించాలి. 10 నిమిషాల పాటు నీరు బాగా మరిగాక దించేసి వడకట్టాలి. అందులో పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రాత్రి నిద్రకు ముందు తాగాలి.
పైన చెప్పిన విధంగా మిశ్రమాన్ని తయారు చేసి రోజూ రాత్రి నిద్రకు ముందు తీసుకోవాలి. ఇలా 3 రోజుల పాటు వరుసగా తీసుకుంటే చాలా వరకు ఛాతిలో ఉండే కఫం పోతుంది. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. దగ్గు, జలుబు తగ్గుతాయి. ఇతర శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.