చాలామందికి వివాహం అంటే భయం. దానికి కారణం వారికి పెళ్లి అంటే ఇష్టం లేకపోవడం వుండాలి లేదా జీవితాంతం ఒకరితోనే వుండాలన్న భయమైనా వుండాలి. రోజుకోసారి ఇంట్లో తల్లి తండ్రులు…పెళ్ళి చేసుకో అని పోరు పెడుతూంటే ఆ పెళ్ళిని ఎలా తప్పించుకోవాలో చూడండి. వివాహం వ్యతిరేకించే కారణాలు. స్వేచ్ఛ కోల్పోతామంటారు. స్వేచ్ఛ కావాలనుకుంటే, పెళ్ళి మానండి. ఎందుకంటే ఇక మీరు పార్టనర్ కి అణిగి వుండాల్సిన పని లేదు. స్నేహితులతో మందు కొట్టటం, షికార్లు, లేట్ నైట్లు మరి మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. సరసాలు.. వివాహం తర్వాత మీకు కావలసినట్లు జీవించలేరు. అన్నిటికంటే మరొకరితో సరసం చేయలేరు. నూటికి నూరు శాతం మీ భాగస్వామికి కట్టుబడి వుండాల్సిందే.
అందమైన అమ్మాయి లేదా అబ్బాయి వంక చూశారో ఇక రెండు లేదా మూడు రోజులు ఇంటిలో పోట్లాటలు తప్పవు. పెళ్ళి అయిన తర్వాత పంచుకోవటమనే భావనను విశ్వసించాలి. బెడ్ లో శారీరకంగానే పంచుకోవడం కాదు, మీ బెడ్ రూమ్, బాత్ రూమ్, లేదా మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము కూడా పంచుకోవలసి వస్తుంది. పెళ్ళికి ముందు మీ స్నేహితుల్లో ఆడా, మగా ఇద్దరూ వుంటారు. కాని పెళ్ళి అయిందా? మీ ఆపోజిట్ సెక్స్ స్నేహితులపై ప్రశ్నలే ప్రశ్నలు. వాడెవడు, ఎందుకు వచ్చాడు వంటివి సాధారణంగా వస్తూనే వుంటాయి.
కొత్తలో ఆమోదించినా పోను పోను, అనుమానాలు, వారి స్నేహాన్ని వదిలెయ్యమనటాలు వంటివి వుంటాయి. పెళ్ళి అయిన తర్వాత పురుషులైనా, స్త్రీలైనా అధిక బరువు సంతరించుకుంటారు. గతంలోని చిన్న వయసు శరీరక రూపం మాయం అవుతుంది. పిల్లలు, ఇతర కుటుంబ భాధ్యతలు మీద పడి మీకు మీరే అశ్రద్ద చేస్తూంటారు. మీలో కళా కాంతులు పోయే ప్రమాదం కూడా వుంది. ఈ కారణంగానే చాలామంది మహిళా సెలిబ్రిటీలు తమ వివాహాలను వాయిదా వేస్తారు. మరి వివాహం చేసుకోరాదని నిర్ణయించుకుంటే, ఈ అంశాలు మార్గదర్శకంగా ఎంచుకోండి.