యాలకులు వేసిన టీ సువాసన భరితంగా రుచిగా ఉంటుంది. నోటి దుర్వాసనని తగ్గిస్తాయి. ఉన్నట్లుండి ముక్కు నుండి రక్తం కారడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని చిట్కాలు పాటించి రక్తం కారడాన్ని ఆపవచ్చు. రక్తం కారుతున్న సమయం లో ముక్కు రంద్రాలను చేతి బొటన వేలు, చూపుడు వేళ్ళతో నాలుగు నిమిషాల పాటు పట్టుకుని ఉంచాలి. రక్తం కారడం మొదలైనప్పుడు వేడినీటిని తాగకూడదు. ఐస్‌క్యూబ్స్ ని ముక్కుదగ్గర పెట్టడం వల్ల రక్తం కారడం తగ్గుతుంది. ఇంకా బ్లీడింగ్ అవుతుంటే డాక్టర్‌ని కలవాల్సిందే…
రుతుక్రమం సమయంలో కడుపునొప్పి బాధిస్తుంటే కిందపొట్ట మీద, నడుము మీద వేడి కాపడం పెట్టాలి. చిన్నటవల్‌ను వేడినీటిలో ముంచి కాపడం పెట్టవచ్చు. లేదా మార్కెట్ లో దొరికే హాట్‌ప్యాక్ బ్యాగ్ వాడవచ్చు. రోజంతా అలసిపోయినా కూడా కొందరికి సరిగా నిద్రపట్టదు. అలాంటప్పుడు పడుకునే ముందు కొత్తీమీర గ్రైండ్ చేసి ఆ రసాన్ని వేడినీటిలో కలిపి తాగినట్లయితే ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా నిద్రపడుతుంది. రోజూ ఒక టేబుల్ స్పూను తేనె తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. తేనెలో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది. రక్తవృద్ధి అవుతుంది. చర్మానికి మెరుపు వస్తుంది.
రోజుకు కనీసం 6 గ్లాసులు నీళ్ళు త్రాగి మలబద్ధకం రాకుండా చూసుకుని చర్మాన్ని అందంగా ఉంచుకోవచ్చు. రోజుకు ఒక టేబుల్ స్పూన్ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి తీసుకుంటే క్రమంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది. రోజుకి మూడు, నాలుగు సార్లు తులసి ఆకులను నములుతూ రసాన్ని మింగటం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. రెండు మూడు లవంగాలను రెండు వెల్లుల్లి రెబ్బలతో కలిపి పేస్టులా చేయాలి. దీనిని కప్పు తేనెలో కలపాలి. రోజుకు మూడు, నాలుగుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉంటే నొప్పి తగ్గుతుంది.