రెండు చిన్న ఉల్లి గడ్డలను చక్రాలుగా కోయాలి. ఉల్లిపాయ ముక్కలను తేనెలో అద్దుకుంటూ ప్రతి పదిహేను, ఇరవై నిమిషాలకొకసారి తింటూ ఉండాలి. లవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది. లవంగాల పొడికి కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూను తేనెని కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. లవంగాల్ని మెత్తగా పొడి చేసి అందులో దాసించెక్క ఆయిల్ కలిపి తలపై ఎక్కడయితే నొప్పిగా అనిపిస్తుందో అక్కడ పూయాలి. లావు కావాలనుకున్నవారు మధ్యహ్నం భోజనంలో గంజి వేసుకొని తింటుంటే ఫలితం ఉంటుంది. లావుగా ఉన్నవారు సన్నబడాలంటే ప్రతి నిత్యం లేతములగాకు (ములగచిగుళ్ళు) రసం తాగుతూ ఉండాలి.
వయసు పెరిగే కొద్దీ ఆయాసం, నీరసం, బడలిక వంటి సమస్యలు వస్తుంటాయి. అవి తగ్గాలంటే రోజూ ఉదయాన్నే పరగడుపున ఒకసారి, మధ్యాహ్నం మూడు గంటల సమయం లో ఒకసారి ఒక గ్లాసు నీటి లో అర టేబుల్ స్పూను తేనె, చిటికెడు దాల్చినచెక్క పొడి కలిపి తీసుకుంటే ఒక వారం రొజుల్లోనే ఫలితం ఉంటుంది. విరేచనాలు అవుతున్నప్పుడు మెంతిపొడిని ఒక అరకప్పు నీటితో కలిపి పొద్దున్నే తాగాలి. ఈ పొడిని మజ్జిగతో కలిపి తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. వెన్ను నొప్పితో బాధపడుతుంటే అల్లం పేస్టుతో మర్ధన చేస్తే తగ్గుతుంది. లేదా గోరువెచ్చని యూకలిప్టస్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి.
వెనిగర్, బాడీ ఆయిల్ సమపాళ్లలో కలిపి తలకు పట్టించి క్యాప్ పెట్టాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. షాంపూ చేయడం పూర్తయ్యాక నీళ్ళు పిండేసి, చివరగా కొద్దిగా వెనిగర్ చేతిలోకి తీసుకొని తలకు పట్టించాలి. వేగించిన వాముని ఉండలా చేసి పలుచని గుడ్డలో పెట్టి దానిని తలనొప్పి తీవ్రత తగ్గేదాక ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తుండాలి. వేడి నీటిలో కొద్దిగా తేనె వేసుకొని తాగితే జలుబు భారం తగ్గుతుంది. వేడి వేడిగా ఉన్న ద్రవపదార్ధాలను వీలయినన్ని ఎక్కువసార్లు తాగుతూ ఉండాలి. లెమన్ టీ గొంతునొప్పిని నివారిస్తుంది.