మన దేశంలో అంతే. నువ్వు ఎంత సంపాదించుకున్నా కచ్చితంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. నువ్వు ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చెయ్యి.. ఏం చేసినా ప్రభుత్వానికి ఇన్‌కంట్యాక్స్ కట్టాల్సిందే. ఈ క్రమంలోనే చాలా మంది తము సంపాదిస్తున్న మొత్తానికి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడతారు. కొందరు బ్లాక్ మనీ పోగేస్తారు. సరే ఈ విషయం పక్కన పెడితే.. ఇంతకీ అసలు మ్యాటరేమిటంటే.. ఏమీ లేదండీ… మన దేశంలో డబ్బు సంపాదిస్తే దాన్ని బట్టి ఇన్‌కమ్‌ట్యాక్స్ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లిస్తాం. కానీ కొన్ని దేశాల్లో ఇన్‌కమ్‌ట్యాక్స్ లేదని మీకు తెలుసా ? అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు చెప్పబోయే దేశాల్లో ఇన్‌కమ్‌ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. మరి ఆ దేశాలు ఏమిటో ఓ లుక్కేద్దామా ?
ఖతార్.. ఇక్కడ ఉద్యోగం చేసే వారు ఎవరూ తమకు వచ్చే ఆదాయంపై ఇన్‌కమ్‌ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. కాకపోతే బిజినెస్ చేసే వారు తమ వ్యాపారంలో వచ్చే ఆదాయంలో 10 శాతం ట్యాక్స్ చెల్లించాలి. వ్యాపారంలో ఎంత లాభం వచ్చినా సరే 10 శాతం ఇన్‌కమ్‌ట్యాక్స్ కడితే చాలు. ఓమన్.. ఈ దేశంలో వ్యాపారం లేదా ఉద్యోగం ఏది చేసినా తమకు వచ్చే ఆదాయంపై ఇన్‌కమ్‌ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేదు. యూఏఈ.. ఎక్కడ కూడా ఇన్‌కమ్‌ట్యాక్స్ లేదు. కానీ ఆయిల్, గ్యాస్, ఆర్థిక సేవలు అందించే వారు, తీసుకునే వారు మాత్రం ట్యాక్స్ కట్టాలి. వనౌటు.. ఈ దేశంలో కూడా ఎవరైనా ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఎంత సంపాదించుకున్నా ఇన్‌కమ్‌ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. అయితే ఈ దేశానికి ఎవరైనా డబ్బును డొనేట్ చేస్తే వారికి ఇక్కడి దేశ ఉచిత పౌరసత్వం లభిస్తుంది.
కేమ్యాన్ ఐల్యాండ్స్.. ఇక్కడి ప్రజలకు కూడా ఇన్‌కమ్‌ట్యాక్స్ లేదు. కానీ ఇన్‌కమ్‌ట్యాక్స్ పడకుండా ఉండాలంటే ఎవరైనా 1.50 లక్షల డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉండాలి. లేదంటే 5 లక్షల డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ లేదా కంపెనీలు కలిగి ఉండాలి. అవి వారి పేరిటే ఉండాలి. అలా ఉంటేనే ఇన్‌కమ్‌ట్యాక్స్ ఉండదు. మొనాకో.. ఈ దేశంలో ఇన్‌కమ్‌ట్యాక్స్ అస్సలు లేనే లేదు. ఎంతైనా సంపాదించుకోవచ్చు. ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. టర్క్స్ అండ్ కైకోస్.. ఈ దేశంలో కూడా ఎంత సంపాదించుకున్నా ఆదాయపు పన్ను లేదు. అయితే ఈ అవకాశం విదేశీయులు కూడా పొందవచ్చు. ఎలాగంటే.. ఈ దేశంలో విదేశీయులు ఎవరైనా 3 లక్షల డాలర్ల విలువ చేసే ఇల్లును లేదా బిల్డింగ్‌ను కొనాలి. లేదా 7.50 లక్షల డాలర్లతో కంపెనీ ప్రారంభించాలి. అలా చేస్తే విదేశీయులు కూడా ఇక్కడ ఇన్‌కమ్‌ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేదు.
బ్రూనై.. ఈ దేశంలోనూ ప్రజలు ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పనిలేదు. బహమాస్.. ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజం. ఆ తరువాత పలు కంపెనీలపై ఆదాయం వస్తుంది. అయితే ఇక్కడ కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్.. ఈ దేశంలో కూడా ఆదాయపు పన్ను లేదు. ఎంత సంపాదించినా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. విదేశీయులు తమ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ చూపిస్తూ 1000 డాలర్లు చెల్లిస్తే వారికి ఇక్కడ రెసిడెన్సీ పర్మిట్ జారీ చేస్తారు.