Are Chettu : మనం కొన్ని రకాల చెట్లను ఇంటి వాస్తు దోషాల పోవడానికి, నర దిష్టి తగలకుండా ఉండడానికి కూడా పెంచుకుంటూ ఉంటాం. అలాంటి చెట్లల్లో ఆరె చెట్టు కూడా ఒకటి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరె చెట్టు ఆకులు, బెరడు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ చెట్టు మనందరికీ తెలుసు. ఈ చెట్టు మనకు నిత్య జీవితంలో ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.రోడ్లకు ఇరు వైపులా, అడవుల దగ్గర ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. భూసారాన్ని రక్షించడంలో ఈ చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగినప్పుడు ఈ చెట్టుకు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇంటి వాస్తు దోషాలను, నర దిష్టిని నివారించడంలో ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇంట్లో ఆరె చెట్టు కర్ర ఉంటే ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అని చాలా మంది నమ్ముతారు. మనం ఇంటి వాస్తు దోషాలను నివారించడానికి ఎన్నో రకాల ప్రయత్రాలు చేస్తూ ఉంటాం. ఆరె కర్ర ఇంటి వాస్తు దోషాలను నివారిస్తుందని చాలా మందికి తెలియదు. ఆరె కర్రను ఇంట్లో పూజ గదిలో ఉంచి ధూప దీప నైవేధ్యాలతో పూజిస్తే ఎటువంటి వాస్తు దోషమైనా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. నర దిష్టిని పోగొట్టడంలోనూ ఆరె చెట్టు ఉపయోగపడుతుంది. నర దిష్టి తగిలిన ఇంట్లోని వారు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. వారికి మనశ్శాంతి ఉండదు. అలాంటి వారు ఆరె కర్రను తెచ్చి పూజిస్తే నర దిష్టి, ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ పోయి ఇంట్లోని వారు ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరె చెట్టును పూజించే వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు.
పూర్వకాలంలో ఈ చెట్టు వేరును మెడలో తాయత్తుగా ధరించే వారు. ఇలా చేయడం వల్ల మనకు దిష్టి తగలకుండా, ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారని నమ్మే వారు. ఈ విధంగా ఆరె చెట్టు వేరును మెడలో ధరించడం వల్ల మనకు ఉన్న గ్రహ దోషాలు అన్నీ తొలగిపోయి గ్రహబలం కూడా పెరుగుతుందని పూర్వకాలంలో గట్టిగా నమ్మేవారు. మన దగ్గరనే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ చెట్టును పూజిస్తారు. మహారాష్ట్రలో దసరా పండుగ నాడు ఈ చెట్టు ఆకులను ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని భావిస్తారు. అంతేకాకుండా భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఈ చెట్టును విరివిరిగా ఉపయోగిస్తారు.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ చెట్టు గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ చెట్టు గింజలను వేడి నీటితో నూరి ఆ గంధాన్ని ఉదయం, సాయంత్రం లేపనంగా రాయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కడుపు నొప్పిని తగ్గించడంలో ఆరె చెట్టు ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరె చెట్టు ఆకులను కచ్చా పచ్చాగా దంచి వాటిని ఆముదం వేసి వేయించి ఒక మూటగా కట్టి పొట్టపై కాపడం పెట్టడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. ఈ చెట్టు ఆకులను పేస్ట్ లా చేసి నుదుటికి రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. క్షయ రోగాన్ని తగ్గించడంలో కూడా ఈ చెట్టు ఉపయోగపడుతుంది. 20 గ్రామలు ఆరె చెట్టు బెరడును ఒక గ్లాస్ నీటిలో వేసి పావు వంతు మిగిలే వరకు మరిగించి వడకట్టి ఆ కషాయాన్ని తాగడం వల్ల క్షయ రోగం క్రమంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ కషాయాన్ని తాగడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
ఈ చెట్టు బెరడును పేస్ట్ లా నూరి దానిని గాయాలపై, పుండ్లపై రాయడం వల్ల అవి త్వరగా మానుతాయి. ఈ చెట్టు బెరడుతో దంతాలను శుభ్రం చేయడం వల్ల సమస్త దంత రోగాలు తగ్గి దంతాలు గట్టిగా మారతాయి. ఆరె చెట్టు బెరడుతో చేసిన కషాయంతో ముఖాన్ని కడుక్కోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ చెట్టు వేరు కషాయాన్ని తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఆరె చెట్టు పూల కషాయాన్ని తాగడం వల్ల జలుబు తగ్గుతుంది. ఈ విధంగా ఆరె చెట్టును ఉపయోగించి అనారోగ్య సమస్యలతో పాటు నర దిష్టిని, వాస్తు దోషాలను నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.