మన దేహంలో ఎల్లప్పుడూ ఎన్నో రకాల జీవరసాయన చర్యలు జరుగుతుంటాయి. అందులో భాగంగానే మనకు శక్తి అందుతూ జీవించగలుగుతున్నాం. అయితే అలాంటి చర్యలు పురుషుల్లో, స్త్రీలల్లో వేర్వేరుగా ఉంటాయి. అంటే ఆహారం జీర్ణమవడం, శక్తి అందడం వంటివి ఇద్దరిలోనూ కామన్ అయినా, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన చర్యలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అలాంటి వాటిలో స్త్రీలకు రుతు క్రమం రావడం కూడా ఒకటి. అయితే పురాతన కాలం నుంచి స్త్రీలలో వచ్చే రుతుక్రమం పట్ల మనలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం మంది ప్రజలలో అనేక అపోహలు ఉన్నాయి. వాటి కారణంగా స్త్రీలు ఆయా రంగాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో రుతుక్రమం పట్ల ఉన్న అపోహలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రుతుక్రమం వచ్చిన స్త్రీలు సముద్రంలోకి వెళ్లినా, అక్కడ మూత్ర విసర్జన చేసినా షార్క్‌లు అటాక్ చేస్తాయనే అపోహ ప్రచారంలో ఉంది. మెన్సస్ వచ్చిన స్త్రీలు బేకరీలలోకి వెళ్లినా, ఆ పరిసరాల్లో ఉన్నా అక్కడ అమ్మే డో నట్స్ అదోరకమైన వాసన వస్తాయని చాలా మంది నమ్ముతారు. అది అపోహే. పీరియడ్స్ వచ్చినప్పుడు శృంగారంలో పాల్గొంటే పిల్లలు అస్సలు పుట్టరు. కానీ కొందరు ఏమంటారంటే ఎరుపు రంగు వెంట్రుకలతో ఉండే పిల్లలు పుడతారని చెబుతారు. అయితే అది నిజం కాదు. రుతుక్రమంలో ఉన్న స్త్రీతో శృంగారంలో పాల్గొంటే గనేరియా వస్తుందని కొందరు నమ్ముతారు. కానీ అది కరెక్ట్ కాదు.
ప్రజలందరూ తాగునీరు పట్టుకునే చోట రుతుక్రమంలో ఉన్న స్త్రీలు ఉండకూడదని చెబుతారు. దీని వల్ల నీరంతా కలుషితం అయిపోతుందని వారు నమ్ముతారు. కానీ అది నిజం కాదు. కాల్చిన కప్పలో బూడిద బాగా పెట్టి యోని దగ్గర ఉంచుకుంటే రుతుక్రమంలో బాగా వచ్చే రక్త స్రావం తగ్గుతుందని కొందరు చెబుతారు. ఇందులో వాస్తవం లేదు. రుతుక్రమంలో వచ్చే రక్తాన్ని ఉపయోగిస్తే వైన్ వెనిగర్‌గా మారుతుందని కొందరు విశ్వసిస్తారు. కానీ ఇది నిజం కాదు. రుతుక్రమం బ్లడ్, వైన్ రెండింటినీ కలిపి చల్లితే పంటలు బాగా పండుతాయని కొందరు నమ్ముతారు. ఇది కూడా అపోహే. స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు జుట్టును శుభ్రం చేసుకోకూడదట. ఈ అపోహ కూడా కొందరిలో ఉంది.
రుతుక్రమంలో ఉన్న స్త్రీ రక్తాన్ని ఏదైనా ఆహారం లేదా నీటిలో కలిపి దాన్ని పురుషుడితో తాగిస్తే వారు ఆమె ప్రేమలో పడిపోతారట. అలా అని కొందరు నమ్ముతారు. ఇది కూడా నిజం కాదు. రాక్షసులను చంపే శక్తి రుతుక్రమం బ్లడ్‌కు ఉంటుందని కొన్ని వర్గాల్లో నమ్ముతారు. ఇది కూడా పూర్తిగా అపోహే. రుతుక్రమం ఉన్నప్పుడు జరిగే రక్తస్రావం వల్ల ఎలుగుబంట్లు స్త్రీలకు ఆకర్షితమవుతాయట. అలా అని కొందరు నమ్ముతారు. కానీ దీంట్లో కూడా నిజం లేదు. రుతుక్రమంలో ఉన్నప్పుడు దంతాల్లో ఏదైనా ఇరుక్కుంటే అది నోటి ద్వారా బయటికి పడుతుందని కొందరు నమ్ముతారు. ఇది కూడా నిజం కాదు. రుతుక్రమంలో ఉన్నప్పుడు వచ్చే బ్లడ్‌ను తాగితే కుష్టు వ్యాధి వస్తుందని కొందరు చెబుతారు. ఇది కూడా అపోహే. రుతుక్రమంలో ఉన్నప్పుడు కలిగే రక్తస్రావంతో పికిల్స్ (ఊరగాయలు) పాడపోతాయని కొందరి నమ్మిక. ఇది కూడా నిజం కాదు. రుతుక్రమం ద్వారా ఓ స్త్రీ నుంచి వచ్చే రక్తాన్ని పురుషుడు తాకకూడదని, అలా తాకితే ఆ పురుషుడు చనిపోతాడని కొన్ని వర్గాల్లో విశ్వాసం ఉంది. అది నిజం కాదు.