క్యాన్సర్… నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఏటా కొన్ని లక్షల మంది దీని కారణంగా మృత్యువాత పడుతున్నారు. క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే చాలు ఇక ఆ వ్యక్తుల ఆయుర్దాయం రోజు రోజుకీ తగ్గిపోతుంటుంది. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. ఈ వ్యాధికి వైద్యం ఎంత అవసరమో అంతే రీతిలో ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవడం కూడా అవసరమే. ఈ క్రమంలో నిత్యం వాడే మందులతోపాటు ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఓ ప్రత్యేకమైన టీని నిత్యం తీసుకుంటే క్యాన్సర్ వ్యాధిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. ఆ టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీరు మరుగుతున్న సమయంలో కొద్దిగా ఎండిన అల్లం పొడి, పసుపును వేయాలి. అనంతరం స్టవ్‌ను సిమ్మర్‌లో ఉంచి మళ్లీ ఆ నీటిని 7 నుంచి 10 నిమిషాల పాటు మరిగించాలి. ద్రవం బాగా మరిగాక దాన్ని ఒక కప్పులోకి తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరిపాలు, కొంత తేనె వేసి తాగాలి. నిత్యం ఇలా చేస్తే క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చు.
అల్లం, పసుపు, కొబ్బరిపాలు, తేనెలలో పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు, ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఆ వ్యాధికి కారణమయ్యే కణాలను, వాటి నిర్మాణాన్ని నాశనం చేస్తాయి. అందుకే ఈ పదార్థాలన్నింటితో తయారు చేసిన టీని తాగితే క్యాన్సర్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది.