Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

యముడి దగ్గర మూడు వరాలు పొందిన ఇత‌ని గురించి మీకు తెలుసా..?

Admin by Admin
March 27, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పూర్వం వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగంలో తన వద్ద ఉన్న సిరిసంపదలను దానం చేస్తే మంచి జరుగుతుందని, తన పాపాలు తొలగిపోతాయని ఆ యాగాన్ని సంకల్పించాడు. అయితే ఆ బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న ముసలి ఆవులను, పనికిరాని గేదెలను దానం చేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన కుమారుడు నచికేతుడు.. తన తండ్రికి ఎటువంటి పాపం జరగకూడదని, ఆ పాపాల నుండి విముక్తి కలిగించాలని… నేను కూడా నీ సంపదనే కదా నన్ను కూడా దానంచేయమని చెప్పాడు.నచికేతుడు మాటలు విసుగ్గా, చిరాకుగా అనిపించి ఇటు పక్క రావొద్దని కసిరాడు. తన తండ్రి చేస్తున్నది తప్పని.. మళ్ళీ వెళ్లి తనను దానం చేయమని అడిగాడు. ప్రతిసారీ విసిగిస్తున్న నచికేతుడుని యముడి దగ్గరకు వెళ్ళమని కోపంగా అన్నాడు వాజశ్రవుడు. ఇచ్చిన మాట నిలుపుకోకపోతే అసత్య దోషం కలుగుతుందని నన్ను యముడి దగ్గరకు పంపమని కోరతాడు నచికేతుడు.

యాగం తర్వాత తను అన్న మాటలకు ఎంతో కుమిలిపోతాడు నచికేతుడి తండ్రి. యముడి వద్దకు వెళతాడు నచికేతుడు. అదే సమయంలో యముడు వేరే కార్యనిమిత్తం ఎక్కడికో వెళ్లిఉంటాడు. మూడు రోజులు గడిచినా యముడు రాలేదు. ఆహారం తీసుకోకుండా మూడు రోజులపాటు అలానే ఉన్నాడు. అయితే తన కోసం వచ్చిన అతిథిని ఇలా ఇన్ని రోజులు ఎదురుచూసేలా చేశానని, దానికి ప్రాయశ్చితంగా మూడు వరాలు కోరుకోమని నచికేతుడికి చెబుతాడు యముడు. నచికేతుడు వరాలు ఇలా ఉన్నాయి. మీ దగ్గర నుండి మళ్ళీ నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళగానే నా తండ్రి ఎటువంటి అనుమానం కలగకుండా ఇంట్లోకి ఆహ్వానించాలి. అలాగే మా తండ్రి చేసిన పాపాలు తొలగిపోవాలి. యమధర్మరాజు:సరే అని బదులిచ్చాడు.

who blessed with 3 boons from lord yama

స్వర్గప్రాప్తి పొందడానికి ఎలాంటి యాగం చేయాలి. ఎలా చేయాలో చూపించమని కోరాడు. య‌ముడు అది కూడా చెప్పాడు. ఈ యాగానికి నాచికేత యాగం అనే పేరు వస్తుందని యముడు బదులిచ్చాడు. మరణం తర్వాత మనిషి జీవితం ఎలా ఉంటుంది, ఏమవుతుంది, బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమన్నాడు. అది రహస్య విషయం కావడంతో యముడు చెప్పడానికి నిరాకరించాడు. చెప్పడం ఇష్టంలేని యముడు కానుకలు ఇస్తానని చెప్పాడు. అయితే నచికేతుడు ఆ నిజం తెలుసుకోవాలని కోరడంతో యముడు బ్రహ్మజ్ఞానం గురించి ఉపదేశించాడు. అలా యముడి నుండి బాల్యంలోనే మూడు గొప్ప వరాలు పొంది, తన తండ్రి పాపాలను తొలగించాడు. యముడి వద్ద నుండి ఇంటికి వచ్చిన అత‌న్ని సాదరంగా ఆహ్వానించాడు నచికేతుడు తండ్రి వాజశ్రవుడు.

Tags: lord yama
Previous Post

శివుడు భయంతో…తలదాచుకున్న పర్వతం ఎక్కుడుందో తెలుసా? అక్కడ ప్రతిదీ అద్భుతమే.!!

Next Post

మ‌నిషి మ‌ర‌ణానికి ముందు య‌మ‌ధ‌ర్మ రాజు 4 మృత్యు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట..!

Related Posts

హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025
హెల్త్ టిప్స్

మీరు బాదం పప్పు డైరెక్ట్ గా తింటునారా?..ఇకపై నీటిలో నానపెట్టి తినండి.. ఎందుకంటే!

July 21, 2025
హెల్త్ టిప్స్

మీ పిల్ల‌లు నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

July 21, 2025
హెల్త్ టిప్స్

డిప్రెష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది..!

July 21, 2025
పోష‌ణ‌

వ‌ర్షాకాలంలో విట‌మిన్ డి ల‌భించాలంటే ఇలా చేయండి..!

July 21, 2025
vastu

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తులు తిరుగుతాయి జాగ్ర‌త్త‌..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.