Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

విక్ర‌మ్ న‌టించిన వీర ధీర శూర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

Admin by Admin
April 8, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

విక్రమ్‌ హీరోగా నటించిన వీర ధీర శూర మూవీ ఎట్టకేలకు రిలీజ్‌ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. విలక్షణ నటుడు విక్రమ్‌ నటుడిగా నిరూపించుకుంటున్నారు. కానీ కమర్షియల్‌ హిట్‌ పడటం లేదు. ఇటీవల చాలా సినిమాలు డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. చివరగా చేసిన తంగలాన్‌ కూడా డిజప్పాయింట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కమర్షియల్‌ మూవీ వీర ధీర శూర చేశాడు. దీనికి ఎస్‌ యూ అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో విక్రమ్‌కి జోడీగా దుస్సరా విజయన్‌ నటించగా, ఎస్‌ జే సూర్య, సూరజ్‌, 30 ఇయర్స్ పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. హెచ్‌ ఆర్‌ పిక్చర్స్ పతాకంపై రియా షిబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేశారు. అయితే పలు ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ మూవీ మార్చి 27న రిలీజ్‌ కాలేదు. అన్ని సమస్యలు సెట్‌ చేసుకుని అదే రోజు ఈవినింగ్‌ విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉంది? విక్రమ్‌ కి ఈ సారైనా హిట్‌ దొరికిందా? అనేది చూద్దాం.

ఇటీవల రా అండ్‌ రస్టిక్‌ మూవీస్‌ బాగా ఆడుతున్నాయి. మాస్‌ కమర్షియల్‌ అంశాలను జోడించి ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా, ట్విస్ట్ లు, టర్న్ లు, ఎలివేషన్లతో తెరకెక్కిస్తే మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి మూవీస్‌ ట్రెండ్‌ నడుస్తుంది. అందులో భాగంగా విక్రమ్‌ కూడా ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు, తాను కమ్‌ బాక్‌ కోసం వీర ధీర శూర మూవీలో నటించారు. ఈ మూవీ కార్తి ఖైదీని తలపిస్తుంది. కాళి పాత్రలో విక్రమ్‌ అదరగొట్టాడు. తనదైన యాక్టింగ్‌తో మెప్పించారు. కాళి పాత్రలో జీవించారు. పాత్రని రక్తికట్టించాడు. అదే సమయంలో డీసెంట్‌గా బిహేవ్‌ చేస్తూ ఆకట్టుకున్నారు. కావాల్సిన ఎలివేషన్లకు ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ నటుడిగా ఆయన దుమ్ములేపాడని చెప్పొచ్చు. ఆయన భార్య పాత్రలో దుసరా విజయన్‌ సైతం అంతే సహజంగా చేసింది. అందరి దృష్టిని ఆకర్షించింది.

how is vikram veera dheera sooran movie review

కన్నన్‌ పాత్రలో సూరజ్‌ బాగా చేశాడు. మరో హైలైట్‌ అయ్యే పాత్ర అయనది. ఇరగదీశాడు. ఇక పెద్దాయన రవి పాత్రలో పృథ్వీరాజ్‌ నటన కూడా ఆకట్టుకుంది. మనకు ఆయన కమెడియన్‌గా తెలుసు. దీంతో విలన్‌గా చూడలేకపోతున్నాం. ఆ పాత్రకి ఇంకా ఎలివేషన్లు, బాక్‌ స్టోరీ ఉంటే బాగుండేది. ఎస్పీగా ఎస్‌ జే సూర్య సినిమాకి మరో పెద్ద అసెట్‌. ఆయన చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఇందులో ఎస్పీగా ఎత్తులకు పై ఎత్తులు వేసే వ్యక్తిగా సూర్య దుమ్ములేపాడు. పాత్రకి ప్రాణం పోశాడు. హీరోని డామినేట్‌ చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో ఆయన పాత్రని డమ్మీ చేశారనిపిస్తుంది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పాలి.

టెక్నీకల్‌గా సినిమా బాగుంది. ముఖ్యంగా తేని ఈశ్వర్‌ కెమెరా వర్క్ వేరే లెవల్‌. బాగా షూట్‌ చేశారు. ప్రసన్న జీకే ఎడిటింగ్‌ ఇంకా కత్తెరకు పనిచెప్పాల్సింది. సినిమా చాలా స్లోగా రన్‌ అవుతుంది. ఆ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సింది. జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. అతి లౌడ్‌గా వెళ్లకుండా థ్రిల్లర్‌ మిక్స్ చేసి ఆయన ఇచ్చిన మ్యూజిక్‌ అదిరిపోయింది. దర్శకుడు అరుణ్‌ ఈ మూవీని రెండు పార్ట్ లుగా తీసుకురావాలనుకున్నారు. కానీ ఇప్పుడు రెండో పార్ట్ ని ముందుగా విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ ఈ మూవీ రిలీజ్‌ అయితే ఉంటుంది. దీంతో ఇందులో కథ సరిగా చెప్పలేదు. అదే కన్‌ఫ్యూజన్‌కి కారణమవుతుంది. ఈ విషయంలో మరింత గ్రిప్పింగ్‌గా కథనాన్ని రాసుకుంటే బాగుంటుంది. ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే వీర ధీర శూర. తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే అంటున్నారు.

Tags: veera dheera sooran movie
Previous Post

పొగ తాగ‌డం మానేస్తే బ‌రువు పెరుగుతార‌ట‌.. అలా ఎందుకు జ‌రుగుతుందంటే..?

Next Post

రైతు జేబులో ఉన్న రాయి, నాణెం.. ఆలోచింప‌జేసే క‌థ‌..

Related Posts

Off Beat

విమానం రెక్క‌లు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?

July 20, 2025
ఆధ్యాత్మికం

మొలతాడు ఎందుకు కడతారో తెలుసా..?దీని వెనుక సైన్స్ ఏంటి అంటే.??

July 20, 2025
mythology

పుష్ప‌క విమానం ఎవ‌రిదో తెలుసా??

July 20, 2025
హెల్త్ టిప్స్

మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
lifestyle

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.