ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు అనేవి మన కళ్ళను ఎప్పటికప్పుడు మోసం చేస్తుంటాయి. అందులోని రహస్యం ఒకటైతే మనకు కనిపించేది మరొకటి. ఇలా మన బుర్రను తికమక పెట్టేస్తాయి. మరి మీకు ఇలాంటి ఫోటో పజిల్స్ ఇష్టమైతే ఓ పట్టు పట్టేద్దాం పదండి.
ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో నెటిజనుల సామర్థ్యాలను పరీక్షించేందుకు, వారి స్వభావం, వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసేలా పలు ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటివి ఇప్పుడు పిల్లలనుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఓ ఫోటో పజిల్ ను మీ ముందుకు తీసుకొచ్చేశాం.
పైన పేర్కొన్న ఫోటో చూస్తుంటే, మీకేం కనిపిస్తోంది. ఠక్కున అందరు అటవీ ప్రాంతమని అంటారు. అవును కరెక్టే, అది ఒక ఇంటికి సంబంధించిన బ్యాక్ యార్డ్. అది కూడా ఫారెస్ట్ లో ఉంది కాబట్టి మీకు అటవీ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇక ఆ చోట ఓ విషపూరితమైన పాము దాగుంది. అది ఎక్కడ ఉందో మీరు గుర్తించాలి. సరిగ్గా 10 సెకండ్లలో కనిపెడితే, మీ కళ్ళలో పవర్ ఉన్నట్లే. మరి లేట్ ఎందుకు ఫస్ట్ అటెంప్ట్ లో ప్రయత్నించండి. ఒకవేళ ఎంత వెతికిన దొరక్కపోతే, సమాధానం కోసం కింద ఫోటో చూడండి.