ఏపీలో ఓ భారీ అరెస్ట్ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించే తరహా అరెస్ట్ ఉండబోతుందని పొలిటికల్ సర్కిల్‌లో వార్త నడుస్తోంది. ఆ అరెస్ట్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ దే అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌లో ఇటీవల టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మద్యం అంశం ప్రస్తావన తీసుకొచ్చారు.
వేల కోట్ల రూపాయలు దేశాలు దాటించారని మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే, తమిళనాడు లిక్కర్ స్కాం కంటే, దేశంలో జరిగిన ఇతర స్కాంల కంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం చాలా పెద్దదని అన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇంటెన్షన్‌ను సూచిస్తున్నాయి. దానికి బలం చేకూర్చేలా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూడా మీడియాతో మాట్లాడారు.
జగన్ అరెస్టుకు కుట్ర జరుగుతోందని ఆయన మీడియాతో అన్నారు. ఏదో రకంగా జగన్‌ను అరెస్ట్ చేయాలని టీడీపీ చూస్తోందన్నారు. వైఎస్ జగన్‌ను అరెస్టుకు సంబంధించి కుట్ర జరుగుతోంది, ఏదో రకంగా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. అయితే ఈ అంశంపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. ఇప్పటికిప్పుడు జగన్‌ను అరెస్ట్ చేస్తే టీడీపీకి వచ్చే ప్రయోజనం ఏమిటి..? అన్న ధోరణిలోనే సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎలక్షన్లకు ముందు అయితే ఈ అంశం కాస్త ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు ఆ విధంగా చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లు సమాచారం.