ఈ భూమ్మీద వున్నది దాదాపు 750 కోట్ల జనాభా. సగటున ఒక్కొక్కరూ నిలబడటానికి 2.5 చదరపు అడుగులు వేసుకుంటే, 16–17కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం గల భూమి చాలు. ఇది అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర వైశాల్యంలో సరిపోతుంది. అంటే వెరసి భూమిపై వున్న జనాభా అంతా కలసి నిలుచుంటే ఇంతుంటారు. ఇది జవాబు కాదు. ఇది చెప్పటానికి ఒక కారణం వుంది. ఇంత మంది కలసి ఒకే సారి జంప్ చేయటం ఇక్కడ సవాలు కదా…
ఇక్కడ గమనించవలసినది ఈ 750కోట్ల జనాభా ప్రత్యేకం ఎక్కడో బయటినుండి భూమ్మీదకు రాలేదు. భూమ్మీది పంచభూతాల మరో రూపమే ఇంతమంది. కాబట్టి, భూమి స్థూలబరువులో మనమంతా భాగమవుతాము. సరే, మన కాలు పీకి దాంతో మనల్నే తంతే నొప్పెట్టక మానదు, కనుక ఇంత మంది కలసి ఎగిరితే excert అయ్యే energy గురించి నా ఆలోచన. See, ఇంతమందీ కలిసి ఒకే చోట ఎగరటం వేరు, భూమ్మీద అందరూ ఎవరి చోట వారు వుండి ఎగరటం వేరు.
జనరేట్ అయిన ఆ ఫోర్స్ అంతా భూమ్మీద తామున్న అదే చోట భూమి చే గ్రహింపబడుతుంది భూమికి ఆటోమేటిగ్గా ఏమీ జరగదు.. ఒక్కసారి దూకినా సరే… ఒక పాపో బాబో తండ్రి గుండెల పై తంతే ఏం జరుగుతుంది? ఇదీ అంతే!