ఇటలీకి చెందిన అలెసియా కాస్టెలియాని, డేనియల్ ఇకోనిస్ లది ఓ విచిత్ర కథ. ఈ ఇద్దరూ పచ్చబొట్టు కళాకారులు. ఇటలీలోని వీరు టురిస్ నగరంలో ఇవసిస్తున్నారు.. అయితే వీరికి ఎంత వెతికినా అద్దె ఇల్లు దొరకలేదు.. దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే షాక్ అవుతారు. సాధారణంగా తెలియని నగరాలకు వెళ్తే.. అద్దెకు ఇల్లు దొరకడం కాస్త కష్టం. మన దేశంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉంటే.. మీకు ఇల్లు కావాలంటే ముందు ఇంటి యజమానికి నచ్చాలి. అప్పుడు కూడా సులభంగా ఇల్లు దొరకదు.. యజమానికి అన్నీ ఓకే అయితే అప్పుడు ఇల్లు లభిస్తుంది. అయితే ఓ జంటకు ఇటలీలో చేదు అనుభవం ఎదురైంది. వీరు ఇల్లు వెతుక్కుంటూ ఎక్కడికి వెళితే అక్కడ.. ఇంటి యజమాని వారికి ఇల్లు ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి కారణం వారి రూపం. అవును వారి రూపాన్ని చూసిన తర్వాత ఇల్లు ఇవ్వడానికి నిరాకరించారు.
డైలీ స్టార్ వెబ్సైట్లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. అలెసియా కాస్టెల్లాని, డేనియల్ ఎకోనిస్ ఇద్దరూ టాటూ ఆరిస్టులు. తాజాగా ఈ ఇద్దరూ ఇటలీలోని టురిన్ నగరానికి మకాం మార్చారు. అక్కడ నివసించడానికి అద్దెకు ఇల్లు వెతుకున్నారు. చాలా మంది టాటూ కళాకారుల మాదిరిగానే అలెసియా, డేనియల్ శరీరంపై అనేక పచ్చబొట్లు ఉన్నాయి. ఈ జంట ముఖంతో పాటు శరీరంలో వివిధ భాగాలపై పచ్చబొట్లుతో నిండిపోయి ఉంది. అయితే శరీరంపై ఎక్కువ టాటూలు ఉన్న వారిపై.. చాలా మంది ఓ భిన్నమైన అభిప్రాయం ఉంది. ఇలా శరీరం నిండా పచ్చబొట్లు ఉండేవారు.. ఎప్పుడూ డిప్రెషన్, మత్తులో ఉంటారని. క్రిమినల్ దృక్పథం కలిగి ఉంటారని అందరూ అనుకుంటారు. సినిమాలు, వాస్తవంగా కూడా నేరస్థుల శరీరంపై ట్యాటూలు ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తారు.
అలెసియా, డేనియల్ లు ఇల్లు వెతుక్కోవాలని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా.. ప్రజలు జోల్టాతో పాటు ఇల్లు ఇవ్వడానికి నిరాకరించారు. ఫేస్ బుక్ గ్రూప్ లో ఓ ఇంటి యజమాని తన ఇంటిని తగలబెట్టడానికైనా సిద్ధం కానీ.. ఇలాంటివారికి ఇల్లు అద్దెకు ఇవ్వనని చెప్పాడు. మీలాంటి వారికి ఎవరైనా ఇల్లు ఎలా అద్దికిస్తారంటూ మరో వ్యక్తి ప్రశ్నించాడు. ఇక వీరిద్దరూ డ్రగ్స్ కు బానిసలు అయినట్లు కనిపిస్తున్నారంటూ.. అందుకే వారికి ఎవరూ అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదని మరో వ్యక్తి చెప్పాడు. తమను ప్రజలు పెద్దగా ఇష్టపడరని తమకు తెలుసని.. కానీ సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్ల గురించి తాము ఆలోచించలేదని ఈ జంట వెబ్ సైట్ తో తెలిపింది.