లేదు కోల్పోయేది ఏమి లేదు . శాకాహారం , మాంసాహారం కంటే ఆరోగ్యానికి మంచిది . శాకాహారంలో క్యాలరీస్ తకువ ఉంటాయి . లో క్యాలరీ డైట్ వల్ల బరువు ఆటోమేటిక్ గా ఎక్కువ పెరగరు . కొన్ని శాకాహారం , మాంసాహారం ఆహారాల మధ్య క్యాలరీ తేడా చూద్దాం (ఇది కేవలం రఫ్ సంఖ్య ఇంచు మించు దగ్గరిలోనే ఉంటుంది కానీ అసలైన సంఖ్య కాదు ). శాకాహారం.. వంకాయల్లో 500 గ్రాములకు 125 క్యాలరీలు, దొండకాయలలో 100 క్యాలరీలు, అన్నంలో 650 క్యాలరీలు, క్యాబేజీలో 264 క్యాలరీలు, అరటి పండులో 445 క్యాలరీలు, మామిడి పండ్లలో 300 క్యాలరీలు ఉంటాయి.
మాంసాహారంలో అయితే చికెన్‌లో 500 గ్రాములకు 1195 క్యాలరీలు, మటన్ 1470 క్యాలరీలు, బీఫ్ 1250 క్యాలరీలు, చేపలు 1030 క్యాలరీలు కలిగి ఉంటాయి. చాలా తేడా ఉంది కదా . అందుకే మాంసాహారo తింటే చాలా తొందరగా బరువు పెరుగుతారు . 4-5+ కేజీలు శాకాహారం తింటే వచ్చే క్యాలరీలు కేవలం 500 గ్రాంల మాంసాహారం తింటే వస్తుంది. మీరు ఇప్పుడు శాకాహారం ఎంత తిన్నా బరువు పెరగడానికి అసలు ఉపపయోగపడదు అని అనుకుంటునారా ? కాదు. 500 గ్రాంల వేగసెనకాయలు 2,835 క్యాలరీలను ఇస్తుంది అంటే మాంసాహారం కంటే 2.5 రేట్లు ఎక్కువ అదే కొలతకి .
మాంసాహారం తినకపోవడం వల్ల విటమిన్ బి 12 డెఫీషియన్సీ వస్తుంది. అలాగే ఐరన్ డెఫీషియన్సీ కూడా అంతే . కేవలం శాకాహారం తినేవారికి కాళ్ళు చల్ల పడడం , గోర్ల దగ్గర తెల్లగా గీతలు రావడం ఇటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఒక శాకాహారినే ఒక మాంసాహారి కంటే ఎక్కువ కాలం బతుకుతాడు . ఒక ఆయన ఎవరో ఆయన జీవితం మొత్తం మాంసమే తింటాను అని చెప్పి చలెంజ్ చేసి 40 ఏళ్ళ లోపే పై లోకానికి పోయాడంట. ఆయిన పేరు గుర్తు లేదు కానీ సోషల్ మీడియాలో ఆయన గురించి ఎవరో రాశారు . కాబట్టి శాకాహారిగా ఉండడం వల్ల పెద్ద నష్టం లేదు, ఆరోగ్యానికి మంచిది కూడా .