మంగళవారం అంటే హనుమంతుడికి చాలా ఇష్టమైన రోజు. ఆయన అనుగ్రహం పొందాలంటే ఈరోజు ప్రత్యేక పూజలు చెయ్యాలి.ఉపవాసం పాటించడం ద్వారా భజరంగబలి అనుగ్రహాన్ని పొందవచ్చు. అదే సమయంలో, మంగళవారం అంగారక గ్రహానికి సంబంధించినది కూడా. అయితే ఈ రోజు కొన్ని రకాల పొరపాట్లు చేస్తే మహాపాపం తగులుతుందని పండితులు అంటున్నారు అవేంటో ఒకసారి చూద్దాం.
జ్యోతిషశాస్త్రంలో మంగళవారం జుట్టు, గోర్లు కత్తిరించుకోవద్దు. ఈ రోజు జుట్టు కత్తిరించడం, షేవ్ చేయడం, గోర్లు కత్తిరించడం అశుభమని నమ్ముతారు. మంగళవారం ఈ పనులన్నీ చేయడం వల్ల మనిషి తెలివితేటలు, డబ్బును కోల్పోవలసి రావచ్చు.
మంగళవారం నాడు ఎవరి దగ్గరా అప్పులు చేయవద్దు, అప్పులు ఇవ్వకూడదని గ్రంధాలలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల మనిషి అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అదే సమయంలో ఇతర నష్టాలను పొందే అవకాశం కూడా పెరుగుతుంది. మంగళవారం హనుమాన్ కి అంకితం అని నమ్ముతారు. ఈ రోజున సాత్వికంగా ఉండాల్సిన అవసరం ఉంది. మంగళవారం నాడు మద్యం, మాంసాహారం వంటివి తీసుకోవడం వల్ల మనిషి పనికి ఆటంకం కలుగుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో మంగళవారం వీటికి దూరంగా ఉండటం మంచిది.
ఇకపోతే మరో విషయం.. మంగళవారాల్లో నల్లని దుస్తులు ధరించకూడదని కూడా చెబుతారు. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మంగళ దోష ప్రభావం తగ్గుతుంది. దేవుడికి ఎర్ర మందారం తో పూజలు చేస్తే చాలా మంచిది.