హిందూ దేవుళ్లు దేవతల్లో అందరు దేవుళ్లలాగే సూర్య భగవానుడు కూడా ఒకడు. సృష్టికి వెలుతురును ప్రసాదించే దైవంగా ఆయన్ను భక్తులు కొలుస్తారు. ఆయన పేరిట మన దేశంలో పలు ప్రాంతాల్లో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక యోగాలో అయితే సూర్య నమస్కారాల గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. వాటిని రోజూ చేస్తుంటే సకల అనారోగ్యాలు పోయి మంచి ఆరోగ్యం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్రమంలో కేవలం సూర్య నమస్కారాలే కాదు, కింద ఇచ్చిన ఆయనకు చెందిన 12 పేర్లను రోజూ జపించినా అలాంటి వారికి అంతా మంచే జరుగుతుందట. అదృష్టం కలసి వస్తుందట. అంతా శుభమే జరిగి కోరుకున్నవి జరుగుతాయట. ఆ 12 పేర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. మిత్ర – ఓం మిత్రాయ నమః, 2. రవి – ఓం రవయే నమః, 3. సూర్య – ఓం సూర్యాయ నమః, 4. భాను – ఓం భానవే నమః, 5. ఖగ – ఓం ఖగాయ నమః, 6. పుషణ్ – ఓం పుష్ణే నమః, 7. హిరణ్యగర్భ – ఓం హిరణ్యగర్భాయ నమః, 8. మారీచ – ఓం మారీచాయే నమః, 9. ఆదిత్య – ఓం ఆదిత్యాయ నమః, 10. సావిత్ర – ఓం సావిత్రే నమః, 11. అర్క – ఓం అర్కాయ నమః, 12. భాస్కర – ఓం భాస్కరాయ నమః.
పైన చెప్పిన విధంగా సూర్య భగవానుడికి చెందిన ఆ 12 పేర్లను నిత్యం ఉదయాన్నే సూర్యుడికి ఎదురుగా నిలుచుని ఉచ్చరించాలి. ఇలా చేసిన వారి కష్టాలు పోతాయట. ధనం, ఆరోగ్యం కలుగుతాయట. విద్యార్థులకైతే చక్కని జ్ఞానం సిద్ధిస్తుందట. సూర్యుడు తేజస్సుకు ప్రతీక కాబట్టి, ప్రతి ఒక్కరి మనస్సు ప్రశాంతంగా మారి వారు రోజంతా ఉత్తేజంగా ఉంటారట.